అధికారులు గౌరవించకుంటే షూ తో కొట్టండి: BJP మంత్రి

అధికారులు గౌరవించకుంటే షూ తో కొట్టండి: BJP మంత్రి

యూపీలో బీజేపీ మంత్రి రతన్ కుష్వాహా వివాదాస్పద వ్వాఖ్యలు చేశారు. తమ పార్టీ కార్యకర్తలను గౌరవించని అధికారులను షూ తో కొట్టాలని కార్యకర్తలతో అన్నారు. ఎస్పీ, బీఎస్పీ పార్టీ సిద్ధాంతాలపై మొగ్గు చూపే అధికారులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరించారు.

ఎవరైనా ప్రభుత్వాధికారులు పార్టీకి చెందిన కార్యకర్తలను గౌరవించకుంటే.. షూ తో వారి చెంప పగలగొట్టాలని అన్నారు. గతంలో కొందరు పోలీసులు, అధికారులు తమతో అమర్యాదగా ప్రవర్తించారని, అందుకే వారిపై ఇంత కఠినంగా మాట్లాడుతున్నానని తనను తాను సమర్ధించుకున్నారు కుష్వాహా.