వరల్డ్ కప్ ఆడేందుకు భారత్కు పాక్ రావాల్సిందే:అనురాగ్ ఠాకూర్

వరల్డ్ కప్ ఆడేందుకు భారత్కు పాక్ రావాల్సిందే:అనురాగ్ ఠాకూర్

2023లో పాకిస్తాన్లో జరిగే ఆసియాకప్ కోసం టీమిండియా రాకుంటే..2023లో భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్లో పాక్ ఆడదన్న పీసీబీ ఛైర్మన్ రమీజ్ రాజా వ్యాఖ్యలను స్పోర్ట్స్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ కొట్టిపారేశారు. పాకిస్తాన్ బెదిరింపులను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. వరల్డ్ కప్లో ఆడేందుకు పాకిస్తానే..భారత్కు వస్తుందన్నాడు.  

భారత్ రాకుంటే..పాక్ కూడా రాదు..

ఆసియా కప్‌ 2023 కోసం పాకిస్తాన్కు భారత్ కు రాకుంటే..పాక్ కూడా వరల్డ్ కప్ 2023 కోసం భారత్లో అడుగుపెట్టదని పీసీబీ చైర్మన్ రమీజ్ రాజా  అన్నాడు. పాకిస్తాన్ వరల్డ్ కప్లో ఆడకుంటే మ్యాచులను ఎవరూ చూడరని వ్యాఖ్యానించాడు. అంతేకాదు..గత ఏడాదిలో భారత్ను పాక్ రెండు సార్లు ఓడించిందని చెప్పాడు. పాక్ బలమైన జట్టుగా మారిందనడానికి ఇదే నిదర్శనమని తెలిపాడు. 


పాక్కు అంతసీన్ లేదు..

ప్రపంచ క్రికెట్లో భారత్ బలమైన శక్తి అని అనురాగ్ ఠాకూర్ అన్నారు. ఏ కంట్రీ కూడా భారత్ను డామినేట్ చేయలేదని చెప్పారు. ఏది ఏమైనా పాక్కు భారత్ వెళ్లదని స్పష్టం చేశాడు. కానీ వరల్డ్ కప్ ఆడేందుకు పాక్ భారత్కు రావాల్సిందేనన్నాడు. టీమిండియా ఆసియాకప్ కోసం పాక్కు వెళ్లకపోతే ఆ దేశానికి భారీ నష్టం అన్నాడు. కొన్ని వందల కోట్ల ఆదాయం కోల్పోవాల్సి ఉంటుందన్నాడు. వరల్డ్ కప్లో ఆడేందుకు పాక్ భారత్కు రాకపోతే కూడా పాకిస్తాన్కే నష్టం అని చెప్పాడు. ఐసీసీ టోర్నీల్లో పాల్గొనడం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆ జట్టు కోల్పోతుందన్నాడు. అలాగే భారత్ పాక్ మ్యాచ్కు వచ్చే ఆదాయాన్ని బీసీసీఐ కోల్పోవాల్సి ఉంటుందన్నాడు.