EVMలపై ఆరోపణ ఎందుకు : మోడీ

EVMలపై ఆరోపణ ఎందుకు : మోడీ

ప్రతిపక్షాలు తమ లోపాలకు EVMలను నిందిస్తున్నాయని…వాటిని ఎందుకు తప్పుపడుతున్నారని ప్రధాని మోడీ ప్రశ్నించారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యావాదాలు తెలిపే కార్యక్రమంలో భాగంగా రాజ్యసభలో మోడీ మాట్లాడారు. ప్రతిపక్షాలకు తమతో పోరాడే సత్తా లేదన్నారు. ఈ EVMలతోనే 113 అసెంబ్లీ, 4 సాధారణ ఎన్నికలు జరిగాయని చెప్పారు. ఈవీఎంల ను నిందించడం ఒక జబ్బు అని మోడీ అన్నారు. ఎన్నికల సంస్కరణలు కొనసాగించాల్సిందేనన్నారు. కాంగ్రెస్‌ ఓడిపోతే దేశ ఓటర్లు ఓడిపోయినట్లు కాదని ఆయన తెలిపారు. ఓటమిని కాంగ్రెస్‌ అంగీకరించలేకపోతోందన్నారు ప్రధాని మోడీ.