‘రివార్డ్స్ 123 ప్లస్’ ఖాతా ఉంటే  ఎన్నో లాభాలు

‘రివార్డ్స్ 123 ప్లస్’ ఖాతా ఉంటే  ఎన్నో లాభాలు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు:  ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్ పేమెంట్స్ బ్యాంక్  రివార్డ్స్ 123 సేవింగ్స్‌‌‌‌‌‌‌‌ అకౌంట్‌‌‌‌‌‌‌‌కు కొనసాగింపుగా రివార్డ్స్ 123 ప్లస్ డిజిటల్ పొదుపు ఖాతాను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఖాతా నుంచి చేసే లావాదేవీల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని తెలిపింది. కస్టమర్లు ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్ థ్యాంక్స్‌‌‌‌‌‌‌‌ యాప్‌‌‌‌‌‌‌‌లోని బ్యాంకింగ్ సెక్షన్‌‌‌‌‌‌‌‌కు వెళ్లి రివార్డ్స్ 123 ప్లస్‌‌‌‌‌‌‌‌కి అప్‌‌‌‌‌‌‌‌గ్రేడ్ కావచ్చు.  దేశంలో ఎక్కడి నుంచైనా నిమిషాల్లోనే అప్‌‌‌‌‌‌‌‌గ్రేడేషన్‌‌‌‌‌‌‌‌ను పూర్తి చేసుకోవచ్చు. వాలెట్ యూజర్లకూ రివార్డ్స్ 123 ప్లస్ ప్రయోజనాలు వర్తిస్తాయి. రివార్డ్స్ 123 ప్లస్‌‌‌‌‌‌‌‌ కోసం ఏటా రూ.500 చెల్లించాలి. ఫలితంగా డిస్నీ+ హాట్‌‌‌‌‌‌‌‌స్టార్ సబ్‌‌‌‌‌‌‌‌స్క్రిప్షన్ -ఏడాదిపాటు ఉచితంగా పొందవచ్చు. దీని విలువ రూ.500. యూపీఐ ద్వారా డబ్బు జమ చేస్తే నెలకు ఒకసారి రూ.10 క్యాష్ బ్యాక్ పొందవచ్చు. కనీసం రూ.1,000 జమచేయాలి. మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్‌‌‌‌‌‌‌‌లు, మొబైల్ పోస్ట్ –పెయిడ్, బ్రాడ్‌‌‌‌‌‌‌‌బ్యాండ్, ల్యాండ్‌‌‌‌‌‌‌‌లైన్, డీటీహెచ్ బిల్లు చెల్లింపులపై నెలకు ఒకసారి రూ.30 క్యాష్‌‌‌‌‌‌‌‌బ్యాక్ పొందవచ్చు. కనీస చెల్లింపు మొత్తం రూ.225 ఉండాలి. రూ.లక్ష–-రూ.రెండు లక్షల డిపాజిట్లపై 6 శాతం వడ్డీని పొందవచ్చు. జీరో మినిమమ్ బ్యాలెన్స్, ఆటో-స్వీప్ వంటి సదుపాయాలూ ఉంటాయి.