వీటితో క్లీన్ చేస్తే బాత్రూమ్ మెరిసిపోతుందంతే..

వీటితో క్లీన్ చేస్తే బాత్రూమ్ మెరిసిపోతుందంతే..

ఇల్లును క్లీన్ గా ఉంచుకోవడం ఎంత ముఖ్యమో.. మనల్ని శుభ్రపర్చే బాత్రూంను నీట్ గా ఉంచడమూ అంతే ముఖ్యం. అందుకోసం మార్కెట్లో అనేక రకాల కెమికల్స్, ఇతర క్లీనింగ్ లిక్విడ్స్ అందుబాటులో ఉన్నప్పటికీ.. ఇంట్లో ఉన్న వాటితోనే బాత్రూంను మిలమిలా మెరిసేలా చేయొచ్చు. డర్టీనెస్ ను తొలగించే బాత్రూంను శుభ్రంగా ఉంచే, చేసే ఈ చిన్న చిట్కాలేంటో ఇప్పుడు చూద్దాం.

  • వెనిగర్, బేకింగ్ సోడాలను నీటితో కలిపి ఆ మిశ్రమాన్ని బాత్రూమ్ టైల్స్ ను క్లీన్ గా ఉంచేలా చేయవచ్చు. ఈ మిశ్రమాన్ని టైల్స్ పై స్ప్రే చేసి కొన్ని నిమిషాలు అలా గాలికి వదిలేయాలి. ఆ తర్వాత ఓ గుడ్డతో తుడిచేస్తే సరిపోతుంది.
  • ఇంట్లోని పలు ప్రదేశాలను క్లీన్ చేసేందుకు ఉపయోగించే.. బ్లీచింగ్ పౌడర్ ను బాత్రూమ్ క్లీనర్ గానూ వినియోగించవచ్చు. దీన్ని బాత్రూమ్ లో మరకలు, డర్టీగా ఉన్న ప్రాంతాల్లో చల్లి.. కాసేపయ్యాక బ్రష్ తో రుద్దాలి. ఆ తర్వాత నీటితో కడిగేయాలి. లేదంటే బ్లీచింగ్ పౌడర్ ను కొద్దిగా నీటిలో కలిపి.. ఆ మిశ్రమాన్ని టైల్స్ లాంటి ప్రాంతాల్లో స్ప్రే చేయాలి. ఓ గంట తర్వాత శుభ్రం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
  • కొన్నిసార్లు బాత్రూమ్ లోని కొన్ని ప్లేసెస్ లో మరీ మొండిగా ఉండే మరకలుంటాయి. అలాంటప్పుడు బ్లీచింగ్ పౌడర్ ను పేస్ట్ లా చేసి మరకల మీద రాయాలి. 2గంటల తర్వాత నీటితో క్లీన్ చేస్తే బాత్రూమ్ నీట్ గా మారుతుంది.
  • స్ర్పే బాటిల్ లో నిమ్మరసం నింపి దాన్ని టైల్స్ మీద స్ప్రే చేయాలి. ఆ తర్వాత తడిగుడ్డతో తుడిచేస్తే మరకలు త్వరగా తొలగిపోతాయి.