
న్యూఢిల్లీ: మహీంద్రా అండ్ మహీంద్రాలో వరల్డ్‌బ్యాంక్ గ్రూప్ కంపెనీ ఐఎఫ్‌సీ రూ. 600 కోట్లు పెట్టుబడి పెడుతోంది. లాస్ట్‌మైల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ బిజినెస్ కోసం ఈ డబ్బు వెచ్చించనున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ తెలిపింది. లాస్ట్‌మైల్ మొబిలిటీ (ఎల్ఎంఎం) పేరుతో పెట్టిన సబ్సిడరీ కంపెనీలో ఐఎఫ్‌సీ ఇన్వెస్ట్ చేస్తున్నట్లు వెల్లడించింది. దేశంలోని ఈవీ మాన్యుఫాక్చరింగ్ రంగంలో ఐఎఫ్‌సీకి ఇదే తొలి పెట్టుబడి కావడం విశేషం. కొత్త కంపెనీలో ఐఎఫ్‌సీకి 9.97 శాతం నుంచి 13.64 శాతం దాకా వాటా ఉండొచ్చు. తమ త్రీ వీలర్స్ ఆల్ఫా, ట్రియో, ఫోర్ వీలర్..ఎస్సీవీ (జీతో) వెహికల్స్ కొత్త కంపెనీ కింద ఉంటాయని మహీంద్రా అండ్ మహీంద్రా వెల్లడించింది. ఎలక్ట్రిక్ మొబిలిటీ లాస్ట్‌మైల్ కనెక్టివిటీని స్కేల్అప్ చేయడానికి ఐఎఫ్‌సీ ఫండ్స్ సాయపడతాయని పేర్కొంది. మరిన్ని కొత్త ప్రొడక్టులు తేవడానికీ వీలు కల్పిస్తాయని వివరించింది. క్లయిమేట్ గోల్స్ సాధించాలంటే ట్రాన్స్పోర్ట్ సెక్టార్లో డీకార్బనైజింగ్ కీలకమని, ఈ దిశలోనే ఐఎఫ్‌సీ తమ కంపెనీకి ఫండింగ్ ఇస్తోందని మహీంద్రా అండ్ మహీంద్రా ఎండీ అనీష్ షా చెప్పారు. ఇండియాలో కరెంటు బండ్లు పెరగాలనే టార్గెట్‌తోనే తాము పెట్టుబడి పెడుతున్నట్లు ఈ సందర్భంగా ఐఎఫ్‌సీ పేర్కొంది.