చేతినాడి గుట్టును.. ఏఐ చెప్పేస్తది!

చేతినాడి గుట్టును.. ఏఐ చెప్పేస్తది!

న్యూఢిల్లీ: ఇప్పటివరకూ రకరకాల వ్యాధులను గుర్తిస్తూ, పేషెంట్లకు కరెక్ట్ ట్రీట్​మెంట్​ను సూచిస్తూ.. ‘వాహ్.. శభాష్’ అనిపించింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టూల్ చాట్ జీపీటీ. ఇప్పుడు చాట్ జీపీటీ తరహాలోనే చేయిలోని నెర్వ్ డిజార్డర్​ను గుర్తించే ఏఐ టూల్​ను బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్​సైన్స్(ఐఐఎస్సీ) సైంటిస్టులు రూపొందించారు.

అరచేతి నుంచి మోచేయి వరకు ఉండే మధ్యస్థ నాడీ (మీడియన్ నెర్వ్) కొన్నిసార్లు మణికట్టు వద్ద దెబ్బతింటుంది. దీనివల్ల మణికట్టు వద్ద నొప్పితోపాటు అరచేయి పనితీరుపై ప్రభావం పడుతుంది. కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ (సీటీఎస్) అనే ఈ డిజార్డర్ ఎక్కువగా టైపింగ్ వర్క్, ఇతర పనులు చేసేవారికి, స్పోర్ట్స్ పర్సన్స్ కు వస్తుంటుంది. డాక్టర్లు ప్రస్తుతం అల్ట్రాసౌండ్ ఇమేజెస్, వీడియోల ద్వారా మణికట్టు వద్ద నాడి ఆకారం, సైజు, దానిలో కలిగిన మార్పులను గుర్తిస్తున్నారు. అయితే, ఎక్స్ రే, ఎంఆర్ఐ స్కాన్​లలో కనిపించినంత క్లియర్​గా ఇందులో నాడిని గుర్తించడం సాధ్యం కావడంలేదు. 

అందుకే తాము అల్ట్రాసౌండ్ ఇమేజెస్, వీడియోలను విశ్లేషించి, సీటీఎస్ ను గుర్తించేలా ఏఐ టూల్​ను రూపొందించామని ఐఐఎస్సీ సైంటిస్ట్ కరణ్​ఆర్ ఉగజరాతి వెల్లడించారు. అరచేయి నుంచి మోచేయి వరకూ అల్ట్రాసౌండ్ వీడియో, ఇమేజెస్​ను అప్ లోడ్ చేస్తే చాలు.. ఇది మీడియన్ నెర్వ్​ను మాత్రమే మొదటి నుంచి చివరి వరకు పూర్తిస్థాయిలో పరిశీలించి, క్లియర్​గా చూపిస్తుందని ఆయన తెలిపారు. ఈ టూల్​తో సీటీఎస్​ను 95% కచ్చితత్వంతో గుర్తించవచ్చన్నారు. వీరి రీసెర్చ్ వివరాలు ఇటీవల ‘ఐఈఈఈ ట్రాన్సాక్షన్స్ ఆన్ అల్ట్రాసోనిక్స్’ జర్నల్​లో పబ్లిష్​ అయ్యాయి.