టాప్ టెన్ లో ఐఐటీ హైదరాబాద్

టాప్ టెన్ లో ఐఐటీ హైదరాబాద్

సంగారెడ్డి, వెలుగు: ప్రపంచ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ లో ఐఐటీ హైదరాబాద్ బెస్ట్ ఫెర్ఫామెన్స్ సొంతం చేసుకుంది. తాజాగా ప్రకటించిన గ్లోబల్ ర్యాంకింగ్ లో సంగారెడ్డి జిల్లా కంది ఐఐటీహెచ్ సత్తా చాటింది. 2026 ఏడాదికి గాను విడుదల చేసిన క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ లో 664 స్థానాన్ని దక్కించుకుంది.

చక్కటి ఫ్యాకల్టీ, విద్యాబోధన తోపాటు రీసెర్చ్ లో ఉత్తమ ఫలితాలు సాధించి ప్రపంచ యూనివర్సిటీ ర్యాంకింగ్ లో ఉన్నత స్థానాన్ని దక్కించుకుంది. ఈ సక్సెస్ పట్ల ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్.మూర్తి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సమష్టి కృషి వల్లే ఇది సాధ్యమైందన్నారు. గ్లోబల్ ఇనిస్టిట్యూట్ లో టాప్ 10 స్థానంలో ఐఐటీహెచ్ చోటు దక్కించుకోవడం గొప్ప విషయమన్నారు.