IIT కాన్పూర్ క్లౌడ్ సీడింగ్ టెస్ట్.. కృత్రిమ వర్షాలు కురిపిస్తారట..

IIT కాన్పూర్ క్లౌడ్ సీడింగ్ టెస్ట్.. కృత్రిమ వర్షాలు కురిపిస్తారట..

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ (IIT-K) ఐదేళ్లుగా క్లౌడ్ సీడింగ్ ద్వారా కృత్రిమ వర్షాలను కురిపించేందుకు ప్రయత్నిస్తోంది. కెమికల్స్ వినియో గించి గాలి నుంచి కాలుష్యం, ధూలిని వేరుచేయడం లో సహాయ పడేందుకు వర్షపాతం పెంచడమే లక్ష్యంగా పనిచేస్తోంది. ఈ టెక్నాలజీని ఉపయోగించి వాతా వరణంలో మార్పుల ద్వారా నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో వర్షాలను కురిపించడాన్ని క్లౌడ్ సీడింగ్ అంటారు. దీనిని  కృత్రిమ వర్షం అని కూడా అంటారు. 

క్లౌడ్ సీడింగ్ ఎలా పనిచేస్తుంది 

సిల్వర్ అయోడైడ్, పోటాషియం అయోడైడ్, డ్రైఐస్(ఘన కార్బన్ డయాక్సైడ్), ద్రవ ప్రొపేన్ లేదా లవణాలను మేఘాలలోకి ఇంజెక్ట్ చేయడానికి శాస్త్రవేత్తలు విమానాలను వినియోగిస్తారు. 

మేఘాలు తరచుగా సహజంగా సంభవించే మంచు కేంద్రాలను కలిగి ఉండవు. కాబట్టి వాటిని సిల్వర్ అయోడైడ్  కణాలు, ఇతర పదార్థాలతో ఇంజెక్ట్ చేయడం వల్ల వర్షాలకు దారితీసే న్యూక్లియై కణాల సంఖ్య పెరుగుతుంది. 

ఈ కణాల ఇంజెక్షన్ మేఘాలు మంచి స్పటికాలను ఉత్పత్తి చేయడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.  ఇవి మంచు పొరలుగా పడిపోతాయి. లేదా మేఘం కింద ఉష్ణోగ్రత ఆధారంగా వర్షపు చినుకులను ఉత్పత్తి చేస్తాయి. 

ఐఐటీ కాన్పూర్ లో క్లౌడ సీడింగ్ ..

ఐఐటీ కాన్పూర్ క్యాంపస్ లలో పరిమిత ప్రాంతాల్లో కృత్రి మ వర్షపు టెక్నాలజీని విజయవంతంగా పరీక్షించింది. ఇది మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లోని నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో వివిధ శాస్త్రీయ సంస్థలచే పరీక్షించబడింది.