ఎన్టీపీసీ యాష్​పాండ్​లో ఇల్లీగల్​గా బూడిద దందా

ఎన్టీపీసీ యాష్​పాండ్​లో ఇల్లీగల్​గా బూడిద దందా

పర్మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒక చోటకు..రవాణా మరోచోటకు  చెకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు లేవు.. జీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ చెల్లించరు

గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి జిల్లాలోని ఎన్టీపీసీ యాష్​పాండ్​లో ఇల్లీగల్​గా బూడిద దందా నడుస్తోంది. నిర్దేశించిన ప్రాంతానికి బూడిద రవాణా చేయకుండా లారీలను పక్కదారి పట్టించి కాంట్రాక్టర్లు పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారు. రోజుకు  పరిమిత సంఖ్యలో బూడిద లారీలను నడిపించాల్సి ఉండగా అక్రమంగా వందల సంఖ్యలో లారీల్లో తరలిస్తున్నారు. రామగుండం ఎన్టీపీసీలో విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉత్పత్తి చేయడానికి బొగ్గును మండిస్తారు. బొగ్గు మండిన తర్వాత రెండు రకాల బూడిద వెలువడుతుంది. పౌడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్న బూడిదను ఫ్లై యాష్‌‌‌‌‌‌‌‌, కొంత రవ్వలాగా ఉన్న బూడిదను బాటమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పిలుస్తారు. ఈ రెండు రకాల బూడిదను పైపుల ద్వారా అంతర్గాం మండలం కుందనపల్లి సమీపంలోని బూడిద చెరువులోకి పంపిస్తారు. కొన్నేళ్ల క్రితం ఈ చెరువులో బూడిద నిండిపోవడంతో ఎన్టీపీసీ సంస్థ దానిని మొదట్లో కొంతకాలం ఉచితంగానే కావాల్సిన వారికి అందజేసింది. తర్వాత సింగరేణికి ఉచితంగా, బయటి వారికి క్యూబిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ.402 చొప్పున ఇస్తోంది. 

సింగరేణికి మాత్రమే బాటమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

సింగరేణి సంస్థ భూగర్భ గనుల్లో బొగ్గు తీసిన తర్వాత ఏర్పడిన ఖాళీ ప్రదేశంలో గతంలో ఇసుకను నింపేది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వల్ల గోదావరిలో నిత్యం నీరు నిల్వ ఉండడంతో ఇసుక తీయడం నిలిచిపోయింది. ఇసుక స్థానంలో కుందనపల్లిలోని ఎన్టీపీసీ యాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గల బాటమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఉచితంగా ఇచ్చేందుకు మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంగీకరించింది. ఇందుకు గాను సింగరేణి సంస్థ టెండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పిలిచింది. రామగుండం ప్రాంతంలోని ఐదు భూగర్భ గనులకు బాటమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సప్లై టెండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పొందిన కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 14 టైర్ల లారీలో 32 క్యూబిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీటర్ల బూడిదను నింపుకొని నిర్దేశించిన బొగ్గు గని వద్దకు తీసుకెళ్లినందుకు ప్రతీ లారీకి దూరాన్ని బట్టి రూ.2,500 నుంచి రూ.3 వేల వరకు సింగరేణి చెల్లిస్తోంది. 

పరిమితికి మించి లోడింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

సింగరేణికి బాటమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సప్లై చేసే ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌2 ఏరియాలో పరిమితికి మించి లోడర్లను పెట్టి లారీల్లోకి నింపుతున్నారు. అలాగే నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైవే నిర్మాణానికి కూడా ఫ్లై యాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఉపయోగిస్తారు. ఈ యాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం ఎన్టీపీసీ టెండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహించి ప్రతి క్యూబిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  మీటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ.402 తీసుకుంటోంది. దీనికి తోడు ఎవరికైనా ఫ్లై యాష్ కావాల్సి వస్తే వారికి కూడా ఇదే రేటుతో మరో టెండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా విక్రయిస్తోంది. ఇదే అవకాశంగా కాంట్రాక్టర్లు సింగరేణికి తరలించాల్సిన బూడిదను పక్కదారి పట్టిస్తున్నారు. సింగరేణికి బాటమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నింపేచోట రోజుకు 22 లారీలకు మాత్రమే అనుమతి ఉంటుంది. కానీ ఇక్కడ రోజుకు 150 నుంచి 200 వరకు లారీల్లో బాటమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తరలిస్తున్నారు. ఇక నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైవే నిర్మాణం, బయటి వ్యక్తులకు అమ్మకాల  పేరుతో కూడా బూడిద లారీలను పక్కదారి పట్టిస్తున్నారు. 12 టైర్ల లారీలో 26 క్యూబిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీటర్ల బూడిదకు బదులుగా 40 క్యూబిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీటర్లు, 14 టైర్ల లారీలో 32 క్యూబిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీటర్లకు బదులుగా 50 క్యూబిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీటర్ల బూడిదను నింపి ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పంపిస్తున్నారు. కాంట్రాక్టర్లకు అలాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన చోట కాకుండా మరో చోట బూడిదను తొలగిస్తున్నా ఎన్టీపీసీ ఆఫీసర్లు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మూడు పాయింట్ల వద్ద బూడిదను నింపడానికి మూడు లోడర్లు, మరో మూడు లోడర్లు స్పేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం 11 లోడర్లు పనిచేస్తూ బూడిదను లారీల్లో నింపుతున్నాయి. ఇలా ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో బూడిద  లారీలు రహదారులపై వెళుతున్నప్పటికీ ఆర్టీవో ఆఫీసర్లు కూడా చూసీ చూడనట్టుగా ఉంటున్నారు. ఎన్టీపీసీ సంస్థ ఏర్పాటు చేసిన చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు నామమాత్రంగా మారాయి. దీనికి తోడు ప్రతి లారీకి 5 శాతం జీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ, ఒక శాతం టీడీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెల్లించకుండా ప్రభుత్వ ఆదాయానికి కాంట్రాక్టర్లు గండి కొడుతున్నారు. డే అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈ ఇల్లీగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దందా సాఫీగా సాగడానికి అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్యమైన నేత అండ ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తంగా ఎన్టీపీసీ బూడిద కాంట్రాక్టర్లకు కాసుల పంట కురిపిస్తుండగా, రూల్స్​ పాటించనప్పటికీ ఆఫీసర్లు చూస్తూ ఉండిపోవడం అనుమానాలకు తావిస్తోంది. 

ఇటుక బట్టీలకు తరలింపు

బాటమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇటుక బట్టీల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ బూడిదను వాడడం వల్ల ఇటుకలో పగుళ్లు కనిపించవు. అందువల్ల ఈ బూడిదను వాడుతుంటారు. దీన్ని అవకాశంగా తీసుకున్న కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగరేణి పేరుతో లారీలో బూడిదను నింపి ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. యాష్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌పాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సమీపంలోని కల్వచర్ల, రాఘవాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాంతాలకైతే ఒక్కో లారీకి రూ.12 వేలు, సుల్తానాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ.16 వేలు, జగిత్యాలకు రూ.20 వేలు, నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇలా రాత్రనక, పగలనక వందల సంఖ్యలో లారీలు నడుస్తున్నాయి. కల్వచర్ల ఇటుక బట్టీల వద్ద పెద్ద మొత్తంలో బూడిద నిల్వలు ఉండడమే ఇందుకు నిదర్శనం. ఇంత జరుగుతున్నా ఇటు ఎన్టీపీసీ ఆఫీసర్లు గానీ, అటు సింగరేణి ఆఫీసర్లు గానీ పట్టించుకోవడం లేదు. ఇటీవల కల్వచర్ల గ్రామంలోని ఓ ఇటుక బట్టీ వద్ద బూడిద లారీ కనిపించింది. లారీని కొందరు పట్టుకుని ఆఫీసర్లకు సమాచారం ఇచ్చినా ఎవరిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.