
కడప: ఏపీలో ఎటువంటి అనుమతులు లేకుండా గసగసాలు సాగు చేస్తున్న ఓ రైతును పోలీసులు అరెస్టు చేశారు. కడప జిల్లా వేంపల్లి మండలం ఇడుపులపాయ కొండల్లో ఐదెకరాల్లో పంట సాగవుతున్నట్లు పోలీసులు గుర్తించి చర్యలు తీసుకున్నారు. అదేంటి కూరల్లో వేసుకునే గసగసాలు పండిస్తే అరెస్టు చేస్తారా అనుకుంటున్నారా? అవును ఇది నిజమే. ఎందుకంటే హెరాయిన్ వంటి మత్తు పదార్థాల తయారీకి గసగసాలు ఉపయోగిస్తారు. అందుకని దీన్ని పండించాలంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవడం తప్పనిసరి. అనంతపురం జిల్లా కదిరికి చెందిన ఓ వ్యక్తి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ఇడుపులపాయ కొండల్లో దాదాపు ఐదు ఎకరాల్లో పంట సాగు చేస్తుండడాన్ని పోలీసులు గుర్తించారు. పొలాన్ని సందర్శించిన అధికారుల బృందం రైతును అరెస్టు చేసి విచారిస్తున్నారు.