
మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో అక్రమ కట్టడాలను తొలగించాలంటూ బీజేపీ నాయకులు ధర్నాకు దిగారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు జరుగుతున్నా… అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. అధికార పార్టీ నేతల అండతో రియల్టర్లు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తర్వాత మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం అందించారు.