ఇది మేకప్ కాదు. చూసేవాళ్ల కళ్లకు పరీక్ష పెట్టే మేకప్

ఇది మేకప్ కాదు. చూసేవాళ్ల కళ్లకు పరీక్ష పెట్టే మేకప్

మేకప్ అంటే ముఖాన్ని అందంగా రెడీ చేయడం అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇది ఆ మేకప్ కాదు. చూసేవాళ్ల కళ్లకు పరీక్ష పెట్టే మేకప్. ఈమె వేసే మేకప్ చూస్తే అది గ్రాఫిక్స్‌‌తో ఎడిట్ చేసిన ఫొటోనా లేదా నిజమైన మనిషా అని తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. మేకప్‌‌తో మాయ చేసే ఈ ఆర్ట్‌‌ను ‘ఇల్యూజన్ మేకప్’ అంటారు. మిమిచోయ్ ఈ ఆర్ట్‌‌లో ఎక్స్‌‌పర్ట్.

కెనడాలోని వాంకోవర్​కు చెందిన మిమిచోయ్.. ముఖాన్నే కాన్వాస్​గా మార్చి చిత్రవిచిత్రమైన ఆప్టికల్​ ఇల్యూజన్స్‌‌ను క్రియేట్ చేస్తోంది. మిమి వేసిన మేకప్ ఆర్ట్స్‌‌ను చూస్తే మన కళ్లు మనల్ని మోసం చేయడం ఖాయం. శరీరాన్ని ముక్కలుగా కోసినట్టు, ముఖంలోని ఒక భాగాన్ని వేరుచేసినట్టు.. ఇలా వందలకొద్దీ మేకప్ ట్రిక్స్ ఆమె సొంతం. ఇలాంటి అబ్బురపరిచే ఇల్యూజన్స్ కోసం మిమిచోయ్ ప్రత్యేకమైన ప్రొడక్ట్స్ ఏమీ వాడదు. క్రయోలాన్ ఆక్వా కలర్స్, బ్యూటీ హైడ్రా లైనర్స్, వాటర్ ప్రూఫ్ లిక్విడ్స్‌‌ను మాత్రమే వాడుతుంది.  తను వేసే ప్రతీ ఆర్ట్ ఛాలెంజింగ్‌‌గానే ఉంటుందని చెప్తున్న మిమికి ప్రపంచవ్యాప్తంగా ఫాలోయింగ్ ఉంది. “ఇల్యూజన్స్ చేస్తున్నప్పుడు.. నా చుట్టూ ఉండే పరిసరాలు, ఫొటోగ్రఫీ, పెయింటింగ్స్, ఎమోషన్స్ నుంచే ఇన్‌‌స్పైర్‌‌‌‌ అవుతా. నా ముఖం ఒక బ్లాంక్ కాన్వాస్. దానిపైనే నేను ఆర్ట్ ప్రాక్టీస్ చేస్తా. నన్ను నేను ఛాలెంజ్ చేసుకుని వర్క్‌‌లోకి దిగుతా’’ అంటోంది మిమి.