తుఫాన్ మోంథా. దేశం మొత్తం అలర్ట్ అయ్యింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరం దాటుతుంది. ఎన్నో తుఫానులు వస్తుంటాయి.. పోతుంటాయి.. ఇప్పుడు తుఫాన్ మోంథా విషయంలో ఎందుకింత భయం అంటే.. ఇదే ఇప్పుడు మీరు తెలుసుకోవాలి.. తుఫాన్ మోంథా సాధారణమైనది కాదు.. ఇది భీకర తుఫాన్.. దీని విధ్వంసం చాలా తీవ్రంగా ఉంటుందని కేంద్రం కూడా హెచ్చరించింది. అందుకే ఇప్పుడు ఈ తుఫాన్ మోంథా గురించి సింపుల్‌గా తెలుసుకుందాం..
>>> తుఫాన్ మోంథా భీకర తుఫాన్‌గా మారి తీరం దాటబోతున్నది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ దగ్గరలో తీరం దాటబోతున్నట్లు అంచనా వేస్తున్నారు అధికారులు.
>>> 2025, అక్టోబర్ 28వ తేదీ ఉదయం 11 గంటల సమయానికి కాకినాడ తీరానికి 270 కిలోమీటర్ల దూరంలో ఉంది. మచిలీపట్నంకు 190 కిలోమీటర్లు.. విశాఖపట్నంకు 340 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయ్యి ఉంది.
>>> తుఫాన్ మోంథా గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదులుతుంది. అంటే 28వ తేదీ మంగళవారం అర్థరాత్రి లేదా బుధవారం తెల్లవారుజామున తీరం దాటనుంది.
>>> తీరం దాటే సమయంలో 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. ఇది ఆషామాషీ గాలులు కాదు.. 110 కిలోమీటర్ల వేగంతో భీకర గాలులు సముద్రం నుంచి మైదాన ప్రాంతానికి దూసుకొస్తాయి. ఆ సమయంలో తుఫాన్ కన్ను.. ప్రభావం చూపే ప్రాంతంలో చెట్లు కూలిపోతాయి.. కరెంట్ స్థంభాలు పడిపోతాయి. కరెంట్ వైర్లు తెగిపడతాయి. హోర్డింగ్స్ ఎగిరిపోతాయి. 50 నుంచి 60 కేజీల బరువు ఉన్న మనిషి సైతం ఈ గాలులకు తట్టుకుని ఆరుబయట నిలబడలేడు.. ఆ స్థాయిలో గాలులు విరుచుకుపడతాయి.
>>> ఇంత భీకర గాలుల సమయంలోనే.. బీభత్సమైన వర్షం పడుతుంది. ఇలా నిట్టనిలువునా ఆగకుండా వర్షం పడుతుంది. తుఫాన్ మోంథా తీరానికి 40 కిలోమీటర్ల దూరం నుంచే ఈ విధ్వంసం స్టార్ట్ అవుతుంది. తీరం దాటి.. మైదాన ప్రాంతంలో ఎంత దూరం అయితే వెళుతుంటే అంత దూరం భీకర గాలులు బీభత్సం చేసుకుంటూ వెళతాయి.
>>> తుఫాన్ మోంతా తీరం దాటిన తర్వాత.. కొద్దిసేపు వర్షం, గాలులు ఆగిపోతాయి. ఆ తర్వాత అసలు వర్షం ప్రారంభం అవుతుంది. కుండపోత వర్షం 8 నుంచి 12 గంటలు ఆగకుండా పడే అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో ఆకస్మిక వరదులు వస్తాయి. వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లుతాయి. చెరువుల్లోకి వరద పోటెత్తి.. చెరువు కట్టలు తెగే ప్రమాదం ఉంటుంది.
>>> తుఫాన్ మోంథా తీరం దాటే రెండు గంటల ముందు.. తీరం దాటిన 12 గంటల తర్వాత వరకు బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. భీకర గాలులు, కుండపోత వర్షంతో అంతా అల్లకల్లోలంగా ఉంటుంది. ఈ సమయంలో అందరూ ఇళ్లల్లోనే ఉంటారు. సహాయ చర్యలు కూడా చేపట్టే అవకాశం ఉండదు.
>>> కరెంట్ ఉండదు.. కనీసంలో 24 గంటలకు అటూ ఇటూ కరెంట్ సరఫరాకు బ్రేక్ పడే అవకాశం ఉంటుంది. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింటుుంది. సెల్ ఫోన్లకు సిగ్నల్ లేక పని చేయకపోవచ్చు. రోడ్లు జలమయం అవుతాయి. బస్సులు, రైళ్ల రాకపోకలకు బ్రేక్ పడుతుంది.
వాతావరణ శాఖ అంచనా ప్రకారం.. తుఫాన్ మోంతా కాకినాడ సమీపంలో తీరం దాటనున్నట్లు చెబుతున్నారు. తీరానికి దగ్గరయ్యే కొద్దీ దిశ మార్చుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇప్పటి వరకు అయితే అలాంటిది ఏమీ లేదని.. కాకినాడ సమీపంలోనే తీరం దాటనున్నట్లు చెబుతున్నారు అధికారులు. ఈ క్రమంలోనే ఏపీలోని 17 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు.
ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యి ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా తీర ప్రాంతాల్లోని 50 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మూడు రోజులు అక్కడే వసతి ఏర్పాటు చేశారు. ఇప్పటికే 5 వేల మంది NDRF, పోలీస్, రెవెన్యూ శాఖలకు చెందిన సహాయ బృందాలు రెడీగా ఉన్నాయి. తుఫాన్ ముందు, తర్వాత సహాయ చర్యలు చేపట్టానికి.. బీ కేర్ ఫుల్..
