హుస్సేన్సాగర్ సమీపంలో పార్కింగ్ ప్రాంతాలు ఇవే

హుస్సేన్సాగర్ సమీపంలో పార్కింగ్ ప్రాంతాలు ఇవే

హైదరాబాద్ నగరంలో గణనాథుల నిమజ్జనం కొనసాగుతోంది. శనివారం పూర్తి స్థాయిలో గణపయ్యలు గంగమ్మ ఒడికి చేరనున్నారు. ఆదివారం చంద్రగ్రహణం ఉన్న కారణంగా మండప నిర్వాహకులు శనివారం అర్ధరాత్రిలోపు నిమజ్జనాలు పూర్తి చేయాలనే పట్టుదలతో ఉన్నారు. ట్రాఫిక్, లా అండ్​ఆర్డర్ ​పోలీస్, జీహెచ్ఎంసీ, హెల్త్, వాటర్​బోర్డు, విద్యుత్, ఆర్టీసీ, మెట్రో ఇతర శాఖల అధికారులు కార్యక్రమాన్ని ప్రశాంతంగా ముగించడానికి చర్యలు తీసుకుంటున్నారు.

పార్కింగ్ ప్రాంతాలివే.. 

ఎన్టీఆర్ స్టేడియం , లోయర్ ట్యాంక్‌బండ్ వద్ద కట్ట మైసమ్మ ఆలయం, పబ్లిక్ గార్డెన్స్ , బుద్ధ భవన్ వెనుక వైపు (నెక్లెస్ రోడ్ ఎంట్రన్స్) , ఆదర్శ్ నగర్ రోడ్ (కళాంజలి షోరూమ్ పక్కన హెచ్‌టీపీ జంక్షన్ ద్వారా ఎంట్రెన్స్),   బీఆర్‌కె భవన్, బల్దియా హెడ్ ఆఫీస్ రోడ్,  ఖైరతాబాద్ జంక్షన్ వద్ద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్.  ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్

ఇవాళ అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు

నిమ‌జ్జనం సంద‌ర్భంగా మెట్రో రైళ్లను శనివారం అర్ధరాత్రి ఒంటిగంట వరకు నడపాలని మెట్రో నిర్ణయించింది. ఉదయం 6 గంట‌ల నుంచి సర్వీసులు ప్రారంభమవుతాయి. టెర్మినల్స్ నుంచి రాత్రి ఒంటి గంట వరకు రైళ్లు బయలుదేరుతాయని మెట్రో ప్రకటించింది.