పేదల కోసం వ్యాక్సిన్​ తయారు చేస్తున్న లండన్​ ఇంపీరియల్​ కాలేజ్​

పేదల కోసం వ్యాక్సిన్​ తయారు చేస్తున్న లండన్​ ఇంపీరియల్​ కాలేజ్​
  • ప్రత్యేకంగా వ్యాక్​ ఈక్విటీ గ్లోబల్​ హెల్త్​ అనే సంస్థ ఏర్పాటు
  • ఈ నెల 15 నుంచి 300 మందిపై ఫస్ట్​ ట్రయల్స్​
  • తర్వాత మరో 6 వేల మందిపై సెకండ్​ఫేజ్

లండన్​: చాలా కంపెనీలు, యూనివర్సిటీలు కరోనా వ్యాక్సిన్​ వేటలో పడ్డాయి. అందులో కొన్ని క్లినికల్​ ట్రయల్స్​ దశకూ వచ్చేశాయి. దానిని ప్రజలకు కమర్షియల్​గా అందించేందుకు చాలా వర్సిటీలు, సంస్థలు పెద్ద పెద్ద కంపెనీలతో ఒప్పందాలు పెట్టుకున్నాయి. కానీ, ఇంపీరియల్​ కాలేజ్​ ఆఫ్​ లండన్​ మాత్రం ‘మా వ్యాక్సిన్​ పేదల కోసం’ అంటోంది. సెల్ఫ్​ ఆంప్లిఫయింగ్​ ఆర్​ఎన్​ఏ టెక్నాలజీతో తయారు చేస్తున్న ఈ వ్యాక్సిన్​ను ప్రపంచంలోని పేదలకు పంచుతామని చెప్పింది. అందుకు ఏ కంపెనీతోనూ ఒప్పందం చేసుకోకుండా సొంతంగా సోషల్​ కంపెనీని పెట్టింది. హాంకాంగ్​లోని మార్నింగ్​సైడ్​ వెంచర్స్​తో కలిసి వ్యాక్​ఈక్విటీ గ్లోబల్​ హెల్త్​ (వీజీహెచ్​)ను ఏర్పాటు చేసింది. ‘‘ప్రస్తుతం మా దృష్టంతా కరోనా నుంచి ఎట్లా బయటపడాలన్నదానిపైనే. డబ్బు సంపాదన గురించి మేం ఆలోచించట్లేదు’’ అని వీజీహెచ్​ డైరెక్టర్​ సైమన్​ హెప్​వర్త్​ చెప్పారు.

ఎందాకొచ్చింది?

ఇంపీరియల్​ కాలేజ్​ తయారు చేస్తున్న ఈ వ్యాక్సిన్​.. కరోనా వైరస్​ స్పైక్​ ప్రొటీన్​ను గుర్తించేలా కండర కణాలకు జెనెటిక్​ ఇన్​స్ట్రక్షన్స్​ ఇస్తుందట. దీంతో శరీరంలోకి వైరస్​ ఎంటరైన వెంటనే ఇమ్యూనిటీ పనిచేసి వైరస్​ను చంపేసే యాంటీ బాడీలను పుట్టిస్తుందట. ప్రస్తుతం ఇది తయారీ దశలోనే ఉంది. జూన్​15న 300 మందిపై ఫేజ్​1 ట్రయల్స్​ ప్రారంభం కాబోతున్నాయి. అక్టోబర్​లో 6 వేల మందిపై ట్రయల్స్​ చేయనున్నారు. వ్యాక్సిన్​ సక్సెస్​ అయితే ముందుగా బ్రిటన్​లోని పేదలకు వ్యాక్సిన్​ను అందిస్తామని వీజీహెచ్​ చెబుతోంది. తర్వాత వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రపంచ దేశాలకు అందిస్తామంటోంది. కాగా, చైనాలో ఈ ఏడాది చివరి నాటికి వ్యాక్సిన్​ అందుబాటులోకి వస్తుందని ఆ దేశ ప్రముఖ రెస్పిరేటరీ ఎక్స్​పర్ట్​ డాక్టర్​ ఝోంగ్​ నాన్షన్​ చెప్పారు. ఎమర్జెన్సీ అయితే చలికాలం ప్రారంభంలోనే దానిని విడుదల చేస్తామన్నారు.

కేన్సర్​ టూల్స్​తో కొత్త స్పాట్లు

కరోనా వైరస్​ను చంపేసే వ్యాక్సిన్​ కోసం కేన్సర్​ను గుర్తించే టూల్స్​ను వాడుకుని ఆ వైరస్​లోని ముఖ్యమైన స్పాట్లను గుర్తించింది అమెరికాలోని చిల్డ్రెన్స్​ హాస్పిటల్​ ఆఫ్​ ఫిలడెల్ఫియా (చాప్​). కేన్సర్​ కణాలపై పోరాడేందుకు ఇమ్యూన్​రెస్పాన్స్​ను యాక్టివేట్​ చేసేందుకు వాడే టూల్స్​నే కరోనా వైరస్​పై పోరాడేందుకూ వాడుతున్నామని చాప్​ నిపుణులు చెబుతున్నారు. ‘‘చాలా విషయాల్లో కేన్సర్​ లాగానే కరోనా వైరస్​ కూడా బిహేవ్​ చేస్తోంది. కాబట్టి చిన్నపిల్లల్లో కేన్సర్​ను గుర్తించేందుకు తయారు చేసిన టూల్స్​తోనే కరోనా వైరస్​ను టార్గెట్​ చేసేందుకు అందులోని కరెక్ట్​ ప్రొటీన్​ సీక్వెన్స్​లను గుర్తించాం’’ అని చాప్​ పీడియాట్రిక్​ ఆంకాలజిస్ట్ ​జాన్​ ఎం మారిస్​ చెప్పారు.

Imperial College promises low-cost access to vaccine
A lab technician extracts a portion of a COVID-19 vaccine candidate during testing at the Chula Vaccine Research Center, run by Chulalongkorn University in Bangkok, Thailand, Monday, May 25, 2020. Researchers in Thailand claim to have promising results with the vaccination on mice, and have begun testing on monkeys. (AP Photo/Sakchai Lalit)