భద్రాద్రి జిల్లా అధికారికి జైలుశిక్ష

భద్రాద్రి జిల్లా అధికారికి జైలుశిక్ష

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపల్ కమిషనర్గా గతంలో పనిచేసిన అంజన్ కుమార్ కు జైలు శిక్ష పడింది.  కోర్టు దిక్కరణ కింద హైకోర్టు రెండు నెలల జైలు శిక్ష విధించింది. ఇల్లందు పట్టణంలో జగదాంబ సెంటర్ నుంచి కరెంట్ ఆఫీసు వరకు గల మెయిన్ రోడ్డు పై ఆక్రమణలు తొలగించాలని పట్టణానికి చెందిన యాకయ్య హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు రోడ్డుకి ఇరువైపుల ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని మున్సిపల్ కమిషనర్ కు ఆదేశిలిచ్చింది. అయితే ఆ పనులు ముందుకు సాగకపోవడంతో..కోర్టు తీర్పును అమలుచేయకుండా గత మున్సిపల్ కమిషనర్ అంజన్ కుమార్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని యాకయ్య కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి కోర్టు తీర్పును అమలు చేయనందున అంజన్ కుమార్ కు కోర్టు రెండు నెలలు జైలు శిక్ష విధించింది.