ఆదిలాబాద్ జిల్లాలో.. పొంగి పొర్లుతున్న వాగులు..జలదిగ్భంధంలో గిమ్మ గ్రామం

ఆదిలాబాద్ జిల్లాలో.. పొంగి పొర్లుతున్న వాగులు..జలదిగ్భంధంలో గిమ్మ గ్రామం

ఆదిలాబాద్: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆదిలాబాద్ జిల్లా వణికిపోతోంది. గురువారం (ఆగస్టు 28) జిల్లాలోని పలు గ్రామాల్లో భారీవర్షాల కారణంగా వరదలు ముంచెత్తాయి. బోరజ్ మండలంలోని వివిధ గ్రామాల్లో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రహదారులపై, బిడ్జీలపైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 

ఆదిలాబాద్ జిల్లా బోరజ్ మండలంలోని పలు గ్రామాలు నీటమునిగాయి. గిమ్మ గ్రామం పూర్తిగా జలదిగ్భంధంలో చిక్కుకుపోయింది.  ఎక్కడ చూసినా వరద నీరే.. వీధులు చెరువులను తలపించాయి. భారీ వర్షాలతో గిమ్మ సమీపంలో రైల్వే అండర్ బ్రిడ్జీ వరద నీటితో నిండిపోయింది.. దాదాపు పది ఫీట్ల మేరకు వరదనీరు ప్రవహిస్తోంది. దీంతో ఆ ప్రాంతంలోని సమీప గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 

►ALSO READ | భయపడొద్దు.. నేనున్నా.. వేలాల ప్రజలకు మంత్రి వివేక్ భరోసా

మరోపవైపు గిమ్మ, కొరాట గ్రామాల మధ్య వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గిమ్మ, కొరాట గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రెండు వైపు దారులు మూసుకుపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.