గార్ల మండలంలో ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియకు నిరసన సెగ

గార్ల మండలంలో ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియకు నిరసన సెగ

మహబూబాబాద్ జిల్లా : గార్ల మండలంలో ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియకు నిరసన సెగ తగిలింది. గార్ల మండలం పాకాల ఏటిపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ మద్దివంచ గ్రామంలో  ఎమ్మెల్యే హరిప్రియను గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో గ్రామస్తులకు, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో అక్కడ పరిస్థితి కాసేపు ఉద్రిక్తంగా మారింది. వెంటనే పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి.. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. 

‘ఏ పార్టీ నుంచి మీరు గెలిచారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలంటూ చెబుతున్నారు’ అంటూ గ్రామస్తులు ప్రశ్నించారు. ఎమ్మెల్యే హరిప్రియ కాన్వాయ్ కు అడ్డుగా ఉండి.. రోడ్డుపై బైఠాయించి.. నిరసన తెలిపారు.