క్వింటాలుకు 7.5 కిలోల తరుగు

క్వింటాలుకు 7.5 కిలోల తరుగు

మల్లాపూర్, వెలుగు:- వడ్ల కొనుగోలు కేంద్రంలో క్వింటాలుకు 7.5 కిలోల వరకు తరుగు తీస్తుండడంతో రైతులు ఆందోళనకు దిగారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్​మండలంలో ముత్యంపేట ప్యాక్స్ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం నిర్వహిస్తున్నారు. తప్ప, తాలు పేరుతో నిర్వాహకులు నిన్నటి వరకు బస్తాకు 42 కిలోలు తూకం వేశారు. బుధవారం నుంచి 43 కిలోలు తూకం వేయడంతో ఆగ్రహించిన రైతులు గ్రామంలోని పూలే విగ్రహం వద్ద రోడ్డుపై బైఠాయించారు.

ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. కోరుట్ల ఆర్డీవో వినోద్ కుమార్, తహసీల్దార్ రవీందర్ అక్కడకు చేరుకుని రైతులతో మాట్లాడారు. అనంతరం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. శుభ్రం చేసిన వడ్లను ప్రభుత్వ రూల్స్​ప్రకారం 40 కిలోల 700 గ్రాములతో తూకం వేయాలని నిర్వాహకులను ఆర్డీవో ఆదేశించారు.