పవిత్ర స్థలాల జోలికొస్తే ఊరుకోబోం

పవిత్ర స్థలాల జోలికొస్తే ఊరుకోబోం

తిరువనతపురం: పవిత్ర స్థలాలను అస్థిరపరిచస్తే చూస్తూ ఊరుకోమని ప్రధాని మోడీ అన్నారు. కేరళలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కొచ్చిలో నిర్వహించిన ర్యాలీలో శబరిమల ఆలయం గురించి మోడీ మాట్లాడారు. శబరిమలతో పాటు రాష్ట్రంలోని ఆలయాలను అధికార ఎల్డీఎఫ్ సర్కార్ అస్థిర పరిచే కుట్ర పన్నుతోందని మోడీ ఆరోపించారు. 

'స్వామియే శరణం అయ్యప్ప. అయ్యప్ప ఆశీస్సులతో ఏర్పడిన ఈ పవిత్ర నేలకు రావడం ఆనందాన్ని ఇస్తోంది. స్వామి అయ్యప్ప ఎప్పుడూ స్పెషలే. దయతో ఉంటూ ఇతరులకు సాయం చేయడానికి ఉన్న విశిష్టతను అయ్యప్ప నుంచి నేర్చుకోవాలి. కానీ అధికార ఎల్డీఫ్ చేస్తోందేంటి? స్వామి భక్తులను పూలతో స్వాగతం పలకాల్సిన చోట లాఠీలతో బాదారు. అయ్యప్ప భక్తులు అమాయకులు. వాళ్లు నేరస్థులు కాదు. పలు దశాబ్దాలుగా మన సనాతన ధర్మాన్ని, ఆచార, సంప్రదాయాలను తక్కువ చేసి చూపడం లెఫ్ట్ పార్టీలకు అలవాటుగా మారింది' అని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు.