కొండాపూర్​లో పులి కలకలం..భయాందోళనలో గ్రామస్తులు

కొండాపూర్​లో పులి కలకలం..భయాందోళనలో గ్రామస్తులు

కొండాపూర్​లో పులి కలకలం
గండీడ్, వెలుగు: గండీడ్​ మండలం కొండాపూర్​ గ్రామంలో పులి కనిపించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామానికి చెందిన రైతు వెన్నచెడు శ్రీనివాస్  ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో పక్క పొలం రైతుతో కలిసి ట్రాక్టర్ పై వెళ్తుండగా, బోల్ర్యలా, రాజ్ కొండ గుట్ట మధ్యలో వీరికి పులి కనిపించింది. ట్రాక్టర్ లైట్లకు గుట్టలోకి  వెళ్తుంటే సెల్ ఫోన్ లో వీడియో తీసుకున్నాడు. పులి కనిపించడంతో చుట్టు పక్కల చేన్లకు కాపాలాకు పోయిన వాళ్లను ఊళ్లోకి పిలిపించి విషయం చెప్పారు.  మైక్ లో చాటింపు వేసి గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ విషయాన్ని ఫారెస్ట్​ ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లి, తమకు ఎలాంటి ఆపద కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు