కాంగ్రెస్‌పై విరుచుకుపడిన జేపీ నడ్డా

కాంగ్రెస్‌పై విరుచుకుపడిన జేపీ నడ్డా

న్యూఢిల్లీ: కేంద్రంపై పదే పదే విమర్శలకు దిగుతున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై బీజేపీ చీఫ్ జగత్ ప్రకాశ్ నడ్డా విరుచుకుపడ్డారు. రాహుల్‌తోపాటు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై ఆయన మండిపడ్డారు. 2008లో చైనా కమ్యూనిస్ట్‌ పార్టీతో కాంగ్రెస్ పార్టీ చేసుకున్న మెమొరాండం ఆఫ్ అండర్‌‌స్టాండింగ్‌ (ఎంవోయూ)పై సుప్రీం కోర్టులో పిటిషన్ ఫైల్ చేశామన్నారు.

‘గతంలో చైనా గవర్నమెంట్‌తో కాంగ్రెస్ పార్టీ చేసుకున్న ఎంవోయూపై సుప్రీం కోర్టు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఆ సంతకాలపై సోనియాతోపాటు ఆయన తనయుడు వివరణ ఇవ్వాలి. ఇది ఆర్‌‌జీఎఫ్​ (రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌)కు వెళ్లిన డొనేషన్స్‌, చైనాకు ఇండియన్ మార్కెట్‌లను తెరవడంపై వివరణ ఇస్తారా? ఇండియాలో బిజినెస్‌లపై పడ్డ ప్రభావం గురించి బదులిస్తారా?’ అని నడ్డా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు జతగా డీల్‌ కాంప్రమైజ్‌కు సంబంధించి న్యూస్ ఆర్టికల్‌ను జత చేశారు. చైనా కమ్యూనిస్ట్‌ పార్టీతో కాంగ్రెస్ చేసుకున్న ఒప్పందంపై సుప్రీం కోర్టు చీఫ్​ జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే చేసిన వ్యాఖ్యలను నడ్డా గుర్తు చేశారు. ‘చైనాతో ఓ పొలిటికల్ పార్టీ ఎలా ఒప్పందం చేసుకుంటుంది. చట్టంలో దీన్ని ఎప్పుడూ వినలేదని బాబ్డే ఆశ్చర్యం వ్యక్తం చేశారు.