
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం శనివారం ఆరు రాష్ట్రాలకు గవర్నర్లను నియమించింది.మధ్యప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, బీహార్ గవర్నర్ లాలాజీ టాండన్‌ను బదిలీ చేస్తూ రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది.
ఆనందీబెన్ పటేల్
గుజరాత్ మాజీ సీఎం ఆనందీ బెన్ పటేల్ 2018 జనవరిలో మధ్యప్రదేశ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఇప్పుడు ఆమెను యూపీకి బదిలీ చేశారు.
లాల్‌జీ టాండన్
గత ఏడాది ఆగస్టులో బీహార్ గవర్నర్‌గా నియమితులైన లాల్‌జీ టాండన్‌ను మధ్యప్రదేశ్ గవర్నర్‌గా (ఆనందీబెన్ స్థానంలోకి) బదిలీ చేశారు.
జగదీప్ ధన్‌కర్
మాజీ ఎంపీ, సుప్రీం కోర్టు లాయర్ ధనకర్ 1990–91 మధ్య కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2003లో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. ఇప్పుడు బెంగాల్ గవర్నర్‌గా నియమితులయ్యారు.
రమేశ్ బయాస్
బీజేపీ సీనియర్ నేత రమేశ్ బయాస్ త్రిపుర కొత్త గవర్నర్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న కప్టాన్‌సింగ్ సోలంకి పదవీ కాలం ఈ నెల 27తో ముగుస్తుంది.
ఆర్‌ఎన్ రవి
ఇంటలిజెన్స్ బ్యూరో స్పెషల్ డైరెక్టర్‌గా పనిచేసి రిటైర్ అయిన రవి నాగాలాండ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఈయన నాగా శాంతి చర్చల్లో కీలక పాత్ర పోషించారు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్‌కు సన్నిహితుడని చెబుతారు.
ఫగు చౌహాన్
బీహార్ గవర్నర్‌గా నియమితులయ్యారు. లాలాజీ టాండన్ ప్లేస్‌లో ఈయన్ను నియమించారు.