
జైట్‌పురా(రాజస్థాన్): పబ్జీ ఆడేందుకు ఫోన్‌అడిగితే ఇవ్వలేదని మైనర్ తన ఫ్రెండ్‌నే చంపేశాడు. రాజస్థాన్ రాజసమండ్ జిల్లాలోని జైట్ పురా గ్రామంలో ఈ దారుణం జరిగింది. గ్రామానికి చెందిన హమీద్ ఈనెల 11న కనిపించకుండా పోయాడు. ఆ బాలుడి కోసం గాలించిన పోలీసులు గుట్టల్లో శవమై కనిపించాడు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులకు విస్తుపోయే విషయం తెలిసింది. హమీద్ సెల్‌ఫోన్ కనిపించకపోవడంతో దాన్ని ట్రేస్ చేసిన పోలీసులు హమీద్ ఫ్రెండ్ దగ్గర ఆ ఫోన్ ఉందని కనుక్కున్నారు. పబ్జీ ఆడేందుకు ఫోన్‌ఇవ్వకపోవడంతో తన ఫ్రెండ్ చంపేసినట్లు తేలింది. తన తల్లిదండ్రులతో కలిసి పొలానికి వెళ్లిన హమిద్‌తిరిగి వారితో కలిసి ఇంటికి రాలేదు. అటు నుంచి తన ఫ్రెండ్‌దగ్గరికి వెళ్లి పబ్జీ ఆడాడు అని తెలిసింది. ‘‘ ఇద్దరు కలిసి పబ్జీ ఆడారు. హమిద్‌ను ఫోన్ అడిగితే ఇచ్చేందుకు నిరాకరించాడు. దీంతో మాటా మాటా పెరిగి ఇద్దరు గొడవపడ్డారు. ఈ నేపథ్యంలో హమిద్‌ను అతని ఫ్రెండ్‌రాయితో తలపై కొట్టి చంపాడు” అని పోలీసు అధికారి అన్నారు.