డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్‌పై ప్రత్యేక దృష్టి: మోడీ

డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్‌పై ప్రత్యేక దృష్టి: మోడీ

న్యూఢిల్లీ: రక్షణ రంగంలో తయారీపై మన దేశం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ప్రధాని మోడీ చెప్పారు. గురువారం ఆత్మనిర్భర్ భారత్ డిఫెన్స్ ఇండస్ట్రీ ఔట్‌సర్చ్ వెబినార్‌‌లో భాగంగా వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ మోడీ పలు విషయాలపై మాట్లాడారు. డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్‌పై మనం ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ‘చాలా ఏళ్లుగా ఇండియా అతిపెద్ద డిఫెన్స్ దిగుమతుదారుల్లో ఒకటిగా ఉంది. స్వాతంత్ర్యం సాధించినప్పుడు డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో ఇండియాకు చాలా సామర్థ్యం ఉండేది. డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్‌కు ఆ రూపు తీసుకురావడానికి వందేళ్లు పట్టింది. అయితే దురదృష్టవశాత్తూ దీనికి అంతగా ప్రాముఖ్యత లభించలేదు’ అని మోడీ పేర్కొన్నారు. డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్‌ పర్మిట్‌ను 74 శాతానికి పెంచామన్నారు.