నార్కట్పల్లి- అద్దంకి హైవేపై..డీజిల్ దొంగలు

నార్కట్పల్లి- అద్దంకి హైవేపై..డీజిల్ దొంగలు

నల్లగొండ జిల్లా నార్కట్ పల్లిలో హైవేపై డీజిల్ దొంగల్ హల్ చల్ చేశారు. శనివారం(ఆగస్టు9)  తెల్లవారు జామున నార్కట్ పల్లి- అద్దంకి హైవేపై ఆగివున్న లారీ నుంచిడీజిల్ దొంగిలించేందుకు ప్రయత్నించారు. 

గమనించిన స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు స్పాట్ కు  చేరుకోవడంతో..దొంగలు అక్కడినుంచి పారిపోయారు.ఘటనా స్థలంలో కారు, వెయ్యి లీటర్ల డీజిల్, ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. దొంగలను పట్టుకునేందుకు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు పోలీసులు. 

కొన్ని రోజులుగా హైవేపై రాత్రి సమయంలో ఫ్యూయెల్ చోరీ జరుగుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఆగివున్న లారీలనుంచి డీజిల్ చోరీ చేస్తున్నారు గుర్తు తెలియని వ్యక్తులు. ఫ్యూయెల్ చోరీపై నార్కట్ పల్లి పీఎస్ పలు కేసులు నమోదు అయ్యాయి.