ESI కుంభకోణం కేసులో రూ. 144 కోట్లు అటాచ్

ESI కుంభకోణం కేసులో రూ. 144 కోట్లు అటాచ్

హైదరాబాద్: ESI కుంభకోణం కేసుకు సంబంధించి మనీలాండరింగ్ చట్టం కింద 144 కోట్ల రూపాయలను అటాచ్ చేశారు ఈడీ అధికారులు. మొత్తం ఐదుగురు నిందితులకు సంబంధించి ఆస్తులను అటాచ్ చేశారు. ESI మాజీ డైరెక్టర దేవికారాణి, మాజీ జేడీ పద్మజ, ఫార్మసిస్టు నాగమణి, ఇద్దరు కాంట్రాక్టర్లకు సంబంధించి 131 ఆస్తులను అటాచ్ చేశారు. ఇందులో 97 ప్లాట్స్, ఆరు విల్లాలు, 18 కమర్షియల్ షాపులు ఉన్నాయి. హైదరాబాద్, బెంగళూరు, నోయిడా, చెన్నైలోని ఆస్తులు కూడా జప్తు చేసిన వాటిలో ఉన్నాయి. దేవికారాణికి సంబంధించి ఆరుకోట్ల 28 లక్షల విలువ చేసే నగలతో పాటు.. భారీ మొత్తంలో నగదును ఫ్రీజ్ చేశారు.