మన మనోబలం ముందు కరోనా జూజూబీ!

మన మనోబలం ముందు కరోనా జూజూబీ!

అమెరికాలాంటి చాలామటుకు అడ్వాన్స్​డ్​ దేశాల్లో కరోనా వైరస్​గా విలయం సృష్టిస్తే, మనదేశం మాత్రం ధైర్యంగా ఎదుర్కొంటోందిమెడిసిన్​, టెక్నాలజీ.. ఏ ఫీల్డ్​లో చూసుకున్నా అవే ముందుంటాయి. కానీ, కరోనాపై పోరులో మాత్రం మనదే పైచేయి. ఇందుకు ఆసక్తి కరమైన కారణాల్ని ఎనలైజ్​ చేసి చెబుతున్నారు చైనా  మెడికల్​ ఎక్స్​పర్ట్​ ఝాంగ్​​ వెన్​హాంగ్.

కోట్ల జనాభా ఉన్న మన దేశంలో కొన్ని మైనస్​లు ఉన్నాయి. కానీ, ఆశ్చర్యకరంగా మిగతా దేశాలతో పోలిస్తే మనదేశంలో కరోనా వ్యాప్తి తక్కువగానే ఉంది. అందుకు రీజన్​ ‘భారతీయుల మనోబలమే’ అని ఝూంగ్​ చెబుతున్నారు. షాంఘై‌‌లోని హౌషన్‌‌ హాస్పిటల్​లో  పని చేస్తున్న ఆయన.. ప్రస్తుతం చైనా ‘కోవిడ్‌‌–19 క్లినికల్‌‌ ఎక్స్‌‌పర్ట్‌‌ టీం’కి లీడ్​ చేస్తున్నారు. లాక్​ డౌన్​ కారణంగా మన దగ్గర చిక్కుకుపోయిన చైనా స్టూడెంట్స్​తో ఆయన వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా మాట్లాడారు.

లైఫ్​ స్టైల్​ వల్లే..

‘‘కరోనా వైరస్‌‌ తట్టుకునే ఇమ్యూనిటీ పవర్​ ఇండియన్స్​కి లేకపోయినా.. వారికున్న మానసిక స్థైర్యం వారిని రక్షిస్తోంది. ముఖ్యంగా ఇండియన్స్​ చాలా ప్రశాంతంగా ఉంటారు. తక్కువ ఆందోళన చెందుతారు. ఈ రెండే వారిని వైరస్​ను ఎదుర్కొనేందుకు సిద్ధం చేస్తున్నాయి.  మిగతా దేశాలతో పోలిస్తే.. ఇండియాలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు తక్కువ.  అయినప్పటికీ కేసుల సంఖ్య తక్కువగా ఉండడానికి కారణం ఇండియన్స్​ లైఫ్​ స్టైల్​’ అని ఝూంగ్​ తన రిపోర్ట్​లో క్లియర్​గా పేర్కొన్నారు.

మనోళ్లు ఏం ఆలోచిస్తున్నారంటే..

వాషింగ్టన్​ యూనివర్సిటీ కూడా దాదాపుగా ఝూంగ్ అభిప్రాయంతో ఏకీభవించింది.  అమెరికాలో కరోనా పేషెంట్లు ఆందోళన, భయం, యాంగ్జైటీ కారణంగానే ఎక్కువగా చనిపోతున్నారని చెప్పింది. ఇండియాలో మరణాల రేటు తక్కువగా ఉండడానికి మానసిక బలమే కారణమని వాషింగ్టన్​ యూనివర్సిటీ పేర్కొంది.
అయితే ఇండియన్స్​లో చాలామంది​ కరోనా ముప్పు కంటే ఉపాధి, ఆదాయం తగ్గిపోతుండడం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారని పేర్కొంది.  కాలేజియేట్ రీసెర్చ్​ ఇన్​స్టిట్యూట్​కూడా భారతీయుల మనోబలాన్ని పొగుడుతూ ఓ రీసెర్చ్​ రిపోర్ట్​ రిలీజ్​ చేసింది. అతితక్కువ మరణాలతో ఇండియా కరోనా ముప్పు నుంచి బయటపడుతుందని ఆ రీసెర్చ్​ వెల్లడించింది.