24 గంటల్లో 20,038 కరోనా కేసులు

24 గంటల్లో 20,038 కరోనా కేసులు

దేశంలో  కరోనా తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతుంది.  గడిచిన 24గంటల్లో 20,038 మంది కరోనా బారిన పడ్డారు. తాజా కేసులతో దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ 4.56 కోట్ల కొవిడ్ కేసులు నమోదయ్యాయని  కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో కరోనా క్రియాశీల కేసులు 1.39లక్షలకు చేరుకోగా.. రికవరీ రేటు 98.49 శాతంగా నమోదైంది.  24 గంటల వ్యవధిలో 16,994 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు 4.30 కోట్ల మందికి పైగా ప్రజలు కరోనా మహమ్మారిని జయించారు. గడిచిన 24 గంటల్లో కరోనాతో 47 మంది మరణించారు.  దీంతో మొత్తం మృతుల సంఖ్య 5.25 లక్షలు దాటింది. 

నేటి నుంచి  ప్రికాషనరీ డోసు
శుక్రవారం నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికి కరోనా వ్యాక్సిన్ ప్రికాషనరీ డోసును కేంద్రం ఉచితంగా అందించనుంది. అన్ని ప్రభుత్వ వ్యాక్సినేషన్ సెంటర్లలో ప్రికాషనరీ డోసు అందుబాటులో ఉండనుంది. ఈ స్పెషల్ డ్రైవ్ 75 రోజుల పాటు ఉంటుంది.