కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అందని జీతాలు

కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అందని జీతాలు

మంచిర్యాల, వెలుగు: రెండు మూడు నెలలుగా జీతాలు రాకపోవడంతో పండుగ పూట చేతిలో పైసలు లేక కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు గోస పడుతున్నారు. ఇచ్చే అరకొర శాలరీలను కూడా ప్రభుత్వం రెగ్యులర్‌‌‌‌గా ఇవ్వడంలేదని వాపోతున్నారు. అప్పులతో కుటుంబాలను నెట్టుకొస్తున్నామని, బతుకమ్మ, దసరా పండుగ టైంలో కూడా జీతం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని డిపార్ట్‌‌మెంట్లలో ఐదారు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో పండుగ పూట కాంట్రాక్ట్ ఉద్యోగులు దిక్కులుచూస్తున్నారు. ఏండ్లుగా కాంట్రాక్ట్, ఔట్​సోర్సింగ్​ఉద్యోగులతో ప్రభుత్వం రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పని చేయించుకుంటున్నా ఆ స్థాయి వేతనాలు ఇవ్వట్లేదు. సమాన పనికి సమాన వేతనం అన్న సుప్రీంకోర్టు ఆదేశాలు చాలా డిపార్ట్​మెంట్లలో అమలుకావడం లేదు. కాంట్రాక్ట్, ఔట్​సోర్సింగ్​ఉద్యోగుల్లో అత్యధికంగా డాక్టర్లకు రూ.49 వేల జీతం ఉండగా.. గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న మల్టీ పర్పస్ వర్కర్లకు రూ.8 వేలే చెల్లిస్తున్నారు. ఈ చాలీచాలని జీతాలను కూడా సమయానికి ఇయ్యకపోవడంతో వారికి అవస్థలు తప్పడం లేదు. 

స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోనే 25,290 మంది

రాష్ట్రవ్యాప్తంగా వివిధ డిపార్ట్‌‌మెంట్లలో 2 లక్షల మందికిపైగా కాంట్రాక్ట్​, ఔట్​సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. అత్యధికంగా స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలో 25,290 మంది కాంట్రాక్టు, 1,813 మంది ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సోర్సింగ్ స్టాఫ్ ఉన్నారు. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 17,200 మంది, పంచాయతీరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖలో 300 మంది సెక్రటరీలు కాంట్రాక్ట్, ఔట్​సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. పశుసంవర్ధకశాఖలో 628 మంది వెటర్నరీ డాక్టర్లు టెంపరరీ బేసిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొనసాగుతున్నారు. విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంస్థల్లో  23 వేల మంది ఆర్టిజన్లు ఉన్నారు. సెర్ప్‌‌‌‌లో ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌4,086 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఈజీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 430 మంది ఏపీవోలు, 7,500 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, రెవెన్యూ శాఖలో 600 మంది ధరణి ఆపరేటర్లు ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. జీహెచ్ఎంసీలో 26 వేల మంది ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సోర్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పనిచేస్తున్నారు. వీరిలో 18 వేల మంది శానిటేషన్ కార్మికులు.. డ్రైవర్లు, సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వైజర్లు, టెక్నికల్ స్టాఫ్ మరో 8 వేల మంది ఉన్నారు. కమిషనర్ అండ్ డైరెక్టర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పరిధిలో 22,533 మంది శానిటేషన్ వర్కర్లు, 7,271 మంది కంప్యూటర్ ఆపరేటర్లు, ఆఫీస్ స్టాఫ్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు.

జులై నుంచి ఎదురుచూపులు

చాలా డిపార్ట్‌‌‌‌మెంట్లలో కాంట్రాక్ట్​, ఔట్​సోర్సింగ్​ ఉద్యోగులకు జులై నుంచి జీతాలు ఇవ్వలేదు. ఔట్​ సోర్సింగ్ పంచాయతీ సెక్రటరీ (ఓపీఎస్​)లకు ఆగస్టు, సెప్టెంబర్​ నెల జీతాలు పడలేదు. మల్టీపర్పస్​ వర్కర్లకూ రెండు నెలలుగా జీతాలు పెండింగ్‌‌‌‌లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి నెలాఖరులో రావాల్సిన స్టేట్ ఫైనాన్స్ నిధులు ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించి ఇంకా రిలీజ్ చేయలేదు. జనరల్ ఫండ్స్ ఉన్న కొన్ని పంచాయతీల్లో మల్టీపర్సస్ వర్కర్లకు జీతాలు ఇవ్వగా.. మెజారిటీ జీపీల్లో చెల్లించలేదు. కలెక్టరేట్లలోని వివిధ డిపార్ట్‌‌‌‌మెంట్లలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్.. రెండు నెలలుగా జీతాల కోసం ఎదురుచూస్తున్నారు. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగులకు మూడు నెలల వేతనాలు పెండింగ్‌‌‌‌లో ఉన్నాయి. మున్సిపాలిటీలు, ఆసుపత్రుల్లో శానిటేషన్ సిబ్బందికి నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వడంలేదు.

అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి..

  • చెన్నూర్ మున్సిపాలిటీలో చెత్త బండ్లు నడిపే డ్రైవర్లకు పది నెలలుగా జీతాలు రాలేదు. వైద్య, ఆరోగ్య శాఖలో సేవలందిస్తున్న కాంట్రాక్ట్ డాక్టర్లకు చాలా జిల్లాల్లో మూడు నెలల నుంచి జీతాలు పడలేదు. శాలరీస్ రెగ్యులర్‌‌‌‌‌‌‌‌గా ఇవ్వడం లేదని మంచిర్యాల జిల్లాలో ఇటీవలే ఒక కాంట్రాక్ట్ డాక్టర్ రాజీనామాచేశారు.
  • ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్‌‌‌‌లో 40 మంది కార్మికులకు జులై, ఆగస్టు శాలరీలు ఇవ్వలేదు. ఉట్నూర్ ఏరియా హాస్పిటల్‌‌‌‌లో పనిచేస్తున్న 20 మంది వర్కర్లకు నాలుగు నెలలుగా రాలేదు. ట్రైబల్ వెల్ఫేర్ స్కూళ్లలో పనిచేస్తున్న సీఆర్టీలకు జులై, ఆగస్టు శాలరీలు రావాల్సి ఉంది.
  • కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జూనియర్ కాలేజీ లెక్చరర్లకు జూన్ నుంచి జీతాలు చెల్లించలేదు. గద్వాల జిల్లాలో మున్సిపల్, హెల్త్​ డిపార్ట్​మెంట్లలో జులై నుంచి శాలరీలు పడలేదు.
  • వనపర్తి జిల్లాలో ఎడ్యుకేషన్ డిపార్ట్​మెంట్‌‌‌‌లో శాలరీలు వచ్చినా, ఇతర డిపార్ట్​మెంట్లలో రెండు నెలల జీతాలు పెండింగ్‌‌‌‌లో ఉన్నాయి.
  • నల్గొండ జిల్లాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ డిపార్ట్‌‌‌‌మెంట్లు, ఆర్‌‌‌‌‌‌‌‌డబ్ల్యూఎస్, 104లో పనిచేస్తున్న డ్రైవర్లు, అటెండర్లు, క్లర్క్‌‌‌‌లకు ఐదారు నెలల నుంచి వేతనాలు ఆగిపోయాయి. ఇటీవల జీతాల కోసం ఆర్‌‌‌‌‌‌‌‌డబ్ల్యూఎస్​ ఉద్యోగులు ఆందోళన చేసినా సర్కారు నుంచి స్పందనరాలేదు.
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆస్పత్రిలో కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న కార్మికులకు మూడు నెలలుగా వేతనాలు అందలేదు. గిరిజన హాస్టల్స్ లలో పనిచేస్తున్న కార్మికులకు ఐదు నెలల వేతనాలు రావాల్సి ఉంది. కొత్తగూడెంలోని మాతా శిశు సంరక్షణ గవర్నమెంట్ హాస్పిటల్​లో శానిటేషన్ సిబ్బందికి ఆరు నెలలుగా జీతాలు ఇవ్వలేదు.

ఉత్త చేతుల్తో ఊళ్లకు పోతెట్ల? 

తెలంగాణలో బతుకమ్మ, దసరా అతి పెద్ద పండుగలు. ప్రతి ఒక్కరూ ఉన్నంతలో బాగా జరుపుకోవాలని అనుకుంటారు. ఇంటిల్లిపాదికి కొత్త బట్టలు తప్పనిసరి. సగటు వేతన జీవులు బంగారం, బైకులు, వస్తువులు కొనేందుకు దసరానే ఎంచుకుంటారు. షోరూమ్​లు, ఆన్​లైన్ మార్కెటింగ్ సంస్థలు కూడా ఆఫర్లు ఇచ్చేది ఇప్పుడే. కానీ తమకు రెండు, మూడు నెలలుగా వేతనాలు రాకపోవడంతో కాంట్రాక్ట్​, ఔట్​సోర్సింగ్ సిబ్బంది ఏం చేయాలో తెలియక దిక్కులు చూస్తున్నారు. కనీసం బట్టలు, బతుకమ్మ తయారీకి పూలు, పండుగ వంటకాలకు నూనె, సరుకులు కొనాలన్నా ఒక్కో కుటుంబానికి కనీసం రూ.10 వేల ఖర్చు అవుతుంది. మార్కెట్‌‌‌‌లో ఏది ముట్టినా రేట్లు వేలల్లోనే ఉంటున్నాయి. మహిళలకు చీరలు, పిల్లలకు బట్టలు కొనకపోతే ఇంట్లో పండుగ సంబురమే కనిపించదు. పట్టణాల్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్లు ఉత్త చేతులతో ఊళ్లకు పోయేదెట్ల అని బాధపడుతున్నారు. ఇప్పటికే అప్పులు చేశామని, కొత్త అప్పు పుట్టే పరిస్థితి లేదని వాపోతున్నారు. ఇప్పటికిప్పుడు కనీసం ఒక నెల జీతం విడుదల చేసినా పండుగ చేసుకోగలగుతామని, సర్కారు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

2 నెలల నుంచి జీతాలు రాలే.. 

వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్​లో 13 మంది శానిటేషన్ వర్కర్లం పనిచేస్తున్నాం. నాలుగైదు నెలలకోసారి జీతాలు ఇస్తున్నరు. ఈసారి రెండు నెలల నుంచి రాలే. కనీసం బతుకమ్మ, దసరా పండుగలు ఉన్నందున ఈ నెల వేతనాలు వెంటనే చెల్లిస్తే బాగుంటుంది. లేదంటే పండుగ ఎల్లదీయడం కష్టమే.

- అనిల్​ కుమార్​, సీఐటీయూ హాస్పిటల్ విభాగం సెక్రటరీ, బెల్లంపల్లి, మంచిర్యాల

జూన్ నుంచి ఇయ్యలే

జూన్ నుంచి మాకు జీతాలు రావట్లేదు. ఆఫీసర్లను అడిగితే బిల్లు చేశాం.. రేపు మాపు వస్తయి అని చెప్తున్నారు. ఇప్పటికే నాలుగు నెలలు దాటింది. జీతాలు పడకపోవడంతో బతుకమ్మ, దసరా పండుగ ఖర్చులు ఎట్లా ఎల్లదీయాలో అర్థమైతలేదు.

- చెన్నగాని పురుషోత్తం, ధరణి ఆపరేటర్, మోతె మండలం, సూర్యాపేట జిల్లా

ఒక నెల జీతమైనా ఇయ్యండి

చాలీచాలని జీతాలకు పనిచేస్తున్నం. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా ప్రజలకు సేవలందిస్తున్నం. కానీ మాపై ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపుతోంది. మూడు నెలల నుంచి జీతాలు ఇయ్యలేదు. పీఆర్సీ అమలు కాలేదు. ఎరియర్స్ రాలేదు. నాలుగు రోజుల్లో బతుకమ్మ, దసరా పండుగలు ఉన్నయి. ఇంటిల్లిపాదికి బట్టలు కొనాలె. పూలు, పిండివంటలకు ఎంతలేదన్నా రూ.10 వేలు కావాలె. కానీ సర్కారుకు మాపై దయ కలగడంలేదు. కనీసం ఒక్క నెల జీతమైనా ఇవ్వాలె.

- కె.కమలాకర్, హెల్త్ అసిస్టెంట్, జన్నారం, మంచిర్యాల జిల్లా