యూ ట్యూబ్ లైవ్ లో…ఎన్నికల ఫలితాలు 

యూ ట్యూబ్ లైవ్ లో…ఎన్నికల ఫలితాలు 

లోక సభ ఎన్నికల ఫలితాలు రేపు( గురువారం) విడుదల కానున్నాయి తెలియనున్నాయి. ఫలితాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేసేందుకు ప్రసారభారతి అన్ని ఏర్పాట్లు చేసింది. ఎన్నికల ఫలితాల కోసం లైవ్‌స్ట్రీమ్‌ను ఏర్పాటు చేయనుంది. దీని కోసం ప్రసార భారతి, గూగుల్‌ సంస్థలు చేతులు కలిపాయి. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను యూట్యూబ్‌లో ఎప్పటి కప్పుడు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ప్రసారభారతి అధికారులు తెలిపారు.

‘యూట్యూబ్‌ వెబ్‌సైట్‌ , యాప్‌ను ఓపెన్‌ చేసిన వెంటనే టాప్ స్క్రీన్‌లో డీడీ న్యూస్‌ స్ట్రీమ్‌ కన్పిస్తుంది. అందులో లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ ఉంటాయి. ఒకసారి ఆ స్ట్రీమ్‌ను క్లిక్‌ చేస్తే డీడీన్యూస్‌ లైవ్‌ యూట్యూబ్‌ ఛానల్‌ వస్తుంది. దీంతో పాటు 14 ప్రాంతీయ భాషాల్లోని డీడీ లైవ్‌ స్ట్రీమింగ్‌ ఆప్షన్స్‌ కన్పిస్తాయి. యూజర్లు తమకు నచ్చినదాన్ని ఎంచుకుని ఎన్నికల ఫలితాలను ప్రత్యక ప్రసారంలో చూడొచ్చని ప్రసారభారతి అధికారులు తెలిపారు.

ఎన్నికల ఫలితాల కోసం ప్రసారభారతి మొదటి సారిగా గూగుల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుందని చెప్పారు.