
ముంబై: ఇండిగో విమానంలో మహిళా సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించిన స్వీడన్ దేశీయుడిని పోలీసులు అరెస్టు చేశారు. గత నెల 29న ఫ్లైట్ బ్యాంకాక్ నుంచి ముంబై వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. నిందితుడిని ఎరిక్ హరాల్డ్ జోనాస్(69) గా గుర్తించారు. సిబ్బంది లో ఒక మహిళ భోజనం సర్వ్ చేస్తుండ గా ఎరిక్ మిస్ బిహేవ్ చేశాడు.
చికెన్ మీల్స్ సర్వ్ చేశాక పీవోఎస్ మెషిన్ ఇచ్చి ఏటీఎం కార్డుతో స్వైప్ చేయాలని అడగగా.. ఎరిక్ హరాల్డ్ ఆమె చేయి పట్టుకున్నాడు. ఆమె వారించగా రెచ్చిపోయి అందరిముందూ లైంగికం గా ఆమెను వేధించాడు. దీంతో బాధితురాలు కెప్టెన్‌కు ఫిర్యాదు చేసింది. విమానం ముంబైలో ల్యాండ్ అయిన తర్వాత పోలీసులు ఎరిక్ హరాల్డ్ జోనాస్‌ను అదుపులోకి తీసుకున్నారు.