అంగరంగ వైభవంగా ఐలోని జాతర.. భారీగా తరలి వచ్చిన భక్తులు

అంగరంగ వైభవంగా ఐలోని జాతర.. భారీగా తరలి వచ్చిన భక్తులు

వరంగల్ జిల్లా ఐనవోలు మల్లన్న జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మల్లికార్జున స్వామికి మొక్కులు చెల్లించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఈరోజు(జనవరి 14) ఉదయం నుంచి క్యూలైన్లలో వేచి ఉన్నారు. లక్షలాది మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి మల్లన్నకు మొక్కులు సమర్పిస్తుంటారు.

సంక్రాంతి పర్వదినం నుంచి ప్రారంభమయ్యే ఈ జాతర ఉగాది పండుగ వరకు కొనసాగుతుంది. అతి పురాతన జాతరగా పేరొందిన ఐలోని మల్లన్నను భక్తులు కొంగుబంగారంగా భావిస్తారు. కాకతీయుల కాలం నుంచి ఈ జాతర కనసాగుతుందని స్థానికులు చెబుతున్నారు. 

జాతర షెడ్యూల్..

  • జనవరి 13న ఉత్సవాలు ప్రారంభం
  • 14న భోగి
  • 15, మకర సంక్రాంతి బండ్లు తిరుగుట
  • 17న మహసంప్రోక్షణ
  • ఫిబ్రవరి 24న ఎల్లమ్మ దేవి పండుగ
  • మార్చి 8న మహా శివరాత్రి, శివ కళ్యాణం, లింగోద్భవం,పెద్ద పట్నం
  • ఏప్రిల్ 7న ఒగ్గు పూజారులచే పెద్ద పట్నం , మల్లికార్జున స్వామి వారి కళ్యాణం
  • ఏప్రిల్ 9న ఉగాది పండుగ (నూతన సంవత్సరాది)