పెరిగిన గర్భ నిరోధక మాత్రల వాడకం

పెరిగిన గర్భ నిరోధక మాత్రల వాడకం

విచ్చలవిడిగా.. గర్భనిరోధక మాత్రల వాడకం పెరిగింది. గర్భం వస్తుందేమోనన్న భయంతో.. పిల్స్ ను ఇష్టానుసారంగా వాడేస్తున్నారు. కరోనా వచ్చిన తర్వాత.. పిల్స్ సేల్స్ అమాంతం పెరిగాయి. గర్భనిరోధక మాత్రలు విచ్చలవిడిగా వాడితే.. మహిళల ఆరోగ్యం దెబ్బతింటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఫ్యూచర్ లో ప్రెగ్నెన్సీ కావాలనుకున్నప్పుడు రాదని చెబుతున్నారు. డోలో, పారసిట్ మాల్ .. ఇలాంటి ట్యాబ్లెట్స్ మాత్రమే కాదు.. కాంట్రాసెప్టివ్ పిల్స్ మెడికల్ షాపుల్లో ప్రిస్కిప్షన్ లేకుండా కొనుగోలు చేయొచ్చు. అవును మీరు విన్నది.. కరెక్టే. ప్రిస్కిప్షన్ లేకుండా.. మెడికల్ షాప్స్ నుంచి కిరాణా షాప్స్ వరకూ సేల్ చేయొచ్చని.. చట్టాలు చెబుతున్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇదే చెబుతోంది. ప్రెగ్నెన్సీ రాకుండా ఉండేందుకు తీసుకొనే అన్ వాంటెడ్ పిల్స్ ను ఓవర్ ది కౌంటర్ అమ్మొచ్చనే వెసులుబాటు ఉండడంతో నాలుగేళ్లుగా అన్ వాంటెడ్ పిల్స్ సేల్స్.. ఐదారువందల రెట్లు పెరుగగా..  అబార్షన్ కిట్ సేల్స్ వంద రెట్లు పెరిగాయి.    

వీటి సేల్స్ ఆన్ లైన్ లో మరింతగా పెరిగాయి. మెడికల్ షాప్స్ కు మించి ఆన్ లైన్ లో ఇష్టానుసారంగా ఆర్డర్స్ పెడుతున్నారు. ఈ అన్ వాంటెడ్, అబార్షన్ కిట్ కు.. బంపర్ ఆఫర్స్ చేస్తున్నారు. సేల్స్ పెరుగుతుండడంతో.. ఈ పిల్స్ ను తయారు చేసేందుకు ఫార్మా కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. స్త్రీ, పురుషుల కలయిక తరువాత గర్భం రాకుండా ఉండేందుకు.. కలిసిన 72 గంటల లోపు వేసుకోవాల్సి ఉంటుంది. పిల్స్ వేస్కుంటే.. గర్భం రాదు. ఎప్పుడో ఒకసారి వేస్కుంటే.. ఫరవాలేదు కానీ.... వీటి వాడకం పెరిగిపోయింది. భార్యభర్తలు కెరియర్.. లేదా ఇతర కారణాలతో..   గర్భం వద్దనుకోవడంతో.. గర్భం వస్తుదేమోనన్న భయంతో పిల్స్ వాడుతున్నారు. ఇక పెళ్లి కాకుండానే సెక్స్ లో పాల్గొనడం, ఇల్లీగల్ ఎపైర్స్ పెరిగిపోవడంతో.. గర్భ నిరోధక మాత్రలు విచ్చలవిడిగా వాడుతున్నారు.

కరోనా టైంలో లాక్ డౌన్ కారణంగా మరింతగా వీటి వాడకం పెరిగిందని డాక్లర్లు వెల్లడిస్తున్నారు. ఇప్పటకీ.. సాఫ్ట్ వేర్ రంగం చాలా వరకూ వర్క్ ఫ్రం హోం కావడంతో.. భార్యభర్తల కలయిక పెరిగినట్లు, ఇలా కారణాలేవైతేనేం.. కాంట్రాసెప్టివ్ పిల్స్.. వాడడం కామన్ అయ్యిందని ప్రముఖ గైనకాలజిస్ట్ శశికళ తెలిపారు. లాభార్జన ఏమో కానీ.. వీటిని ఎక్కువగా వాడితే.. ప్రాణాలకే ప్రమాదం అని హెచ్చరిస్తున్నారు. ఇష్టానుసారంగా పిల్స్ వాడకంతో.. ప్రపంచవ్యాప్తంగా రోజూ 10 మంది మహిళలు చనిపోతున్నారని సర్వేలు చెబుతున్నాయని డాక్టర్ శశికళ చెప్పారు.  

గర్భనిరోధక మాత్రలు వాడితే.. నీటి శాతం అధికమై మహిళలు బరువు పెరుగుతారని ప్రముఖ గైనకాలజిస్ట్ స్వాతి తెలిపారు. మొటిమలు, అవాంచిత రోమాలు వస్తాయని చెప్పారు. నెలసరి తప్పిపోవడం, బ్లీడింగ్ ఎక్కువ్వడం, అలసట, నీరసం, లైంగిక ఆసక్తి తగ్గడం వంటి ఎన్నో సమస్యలు తలెత్తుతాయని సూచించారు. డాక్టర్ సలహా లేకుండా వాడితే.. మనకు కావాల్సినప్పుడు గర్భం ధరించే అవకాశాలు తగ్గి, ఇన్ఫర్టిలిటీ సమస్యలు వస్తున్నాయని గైనకాలజిస్ట్ స్వాతి చెప్పారు.

అంతేకాక కొన్ని కేసుల్లో ఆ ఎఫెక్ట్ పిల్లల మీద కూడా పడుతుందని గైనకాలజిస్టులు చెబుతున్నారు. ఓ సర్వే ప్రకారంగా వెస్ట్రన్ కంట్రీస్ కంటే ముందు వరుసలో ఉన్నారు భారతీయ మహిళలు. ఆధునిక పద్దతులను అనుసరిస్తూ.. అవాంచిత గర్భాన్ని అడ్డుకోవడంలో.. 69 దేశాల మహిళల కంటే 33 శాతం ముందు వరుసలో ఉన్నారు. 15 కోట్ల మంది గర్భం రాకుండా జాగ్రత్త పడుతోన్నారంటే.. వీటి సేల్స్ ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. గర్భనిరోధక మాత్రలు, కండోమ్, మహిళలకు సంబంధించిన గర్భనిరోధక వస్తువులు, ఫ్యామిలీ ప్లానింగ్.. పద్దతులతో గర్బాన్ని రాకుండా అడ్డుకుంటున్నారు. అంతే కాక ప్రమాదకర అబార్షన్లను అదుపు చేస్తున్నారు.  గర్భనిరోధక పద్దతులు వాడుతోన్న మహిళలు 2012లో 20 శాతం ఉండగా.. ప్రస్తుతం 30 శాతం వరకూ పెరిగిందని సర్వే చెప్పింది.  అన్ వాంటెడ్ పిల్స్ వాడకంపై నిషేధం విధించకపోతే.. రాబోయే రోజుల్లో వీటి వాడకం మరింత పెరుగుతాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా సాగుతున్న అమ్మకాల దందాను అడ్డుకుంటే.. కొంతవరకూ కట్టడి చేయొచ్చంటున్నారు. సో చిన్న పిల్ కదా అని ఇష్టానుసారం వేసుకొంటే.. ఫ్యూచర్ లో ఇబ్బందులు పడకతప్పదు.. బీ కేర్ ఫుల్ అని డాక్టర్లు  హెచ్చరిస్తున్నారు.

 

మరిన్ని వార్తల కోసం  :-

ఫోర్టిఫైడ్ రైస్ టెస్టింగ్ కోసం రిసోర్స్​ సెంటర్లు

భారీగా పెరుగుతున్న వెహికల్స్