
కరోనా కారణంతో పెరుగుతున్న సైబర్ అటాక్స్ పై మార్కెట్ ఇంటర్‌మీడియేటరీస్ జాగ్రత్త గా ఉండాలని బీఎస్‌ఈ సూచించిం ది. కరోనా వల్ల మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌ల వాడకం విపరీతంగా పెరిగిందని, దీంతో సైబర్ అటాక్స్ కూడా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. చాలా సంస్థలు కరోనా వల్ల వర్క్ ఫ్రం హోమ్ ఆఫర్ చేస్తున్నాయి.దీంతో ఉద్యోగులందరూ మొబైల్ ఫోన్లు, ట్యాబ్‌లు, పీసీలను ఎక్కువగా వాడుతున్నారు . ఆన్‌లైన్ పై ఆధారపడటం ఇది వరకటి కంటే పలు రెట్లు పెరిగింది. ఇదే అదునుగా చూసుకుని సైబర్ నేరగాళ్లు దాడులకు పాల్పడుతున్నా రని బీఎస్‌ఈ తెలిపింది. ఈ దాడుల విషయంలో మార్కెట్ ఇంటర్‌మీడియేటర్స్ జాగ్రత్తగా ఉండాలని సూచించింది. పర్సనల్ మొబైల్ ఫోన్లు ఎప్పటికప్పుడూ సురక్షితంగా ఉండేలా చూసుకోవాలని అడ్వయిజరీ నోట్ జారీ చేసింది. సెబీ జారీ చేసిన సైబర్ సెక్యూరిటీ మార్గదర్శ కాలను పాటించాలని మార్కెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్‌స్టిట్యూషన్స్, మార్కెట్ ఇంటర్‌మీడియేటర్స్, మ్యూచువల్ ఫండ్స్ ను ఆదేశించింది. సైబర్ సెక్యురిటీ ఏజెన్సీ సెర్–ఇన్ ట్ జారీ చేసే రికమెండేషన్లను, ఇతర అడ్వయిజరీలను ఫాలో అవ్వాలని బీఎస్‌ఈ తెలిపింది.