ఎల్‌ఐసీ షేరు పెరుగుతది!

ఎల్‌ఐసీ షేరు పెరుగుతది!
  • ఎల్‌ఐసీ షేరు పెరుగుతది!
  • రేటింగ్‌‌‌‌ ఇచ్చిన  జేపీ మోర్గాన్

న్యూఢిల్లీ: ఎల్‌‌ఐసీ షేరు ధరను మార్కెట్‌‌ తప్పుగా లెక్కించిందని చెబుతూ ఈ కంపెనీ షేరుకి ‘ఓవర్‌‌‌‌ వెయిట్‌‌’ రేటింగ్‌‌ను బ్రోకరేజ్ కంపెనీ జేపీమోర్గాన్ ఇచ్చింది. ఓవర్ వెయిట్ అంటే షేరు పెరుగుతుందని అంచనావేయడం. మార్కెట్‌‌లో లిస్టింగ్ అయిన తర్వాత నుంచి ఎల్‌‌ఐసీ షేరు 31 శాతం మేర పతనమయ్యింది. వచ్చే ఏడాది మార్చి నాటికి ఎల్‌‌ఐసీ షేరు  రూ.840 వరకు వెళుతుందని జేపీమోర్గాన్ తన రీసెర్చ్ రిపోర్ట్‌‌లో వెల్లడించింది. ‘కంపెనీ వాల్యుయేషన్ ఆకర్షణీయంగా ఉండడంతో ఎల్‌‌ఐసీ షేరుకు ఓవర్ వెయిట్ రేటింగ్‌‌ను ఇస్తున్నాం’ అని వివరించింది. 2022–23 ఆర్థిక సంవత్సరంతో పాటు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎల్‌‌ఐసీ యాన్యువల్‌‌ ప్రీమియం  6 శాతం మేర పెరుగుతుందని ఈ బ్రోకరేజ్‌ కంపెనీ అంచనావేస్తోంది. ఎల్‌‌ఐసీ షేరు సోమవారం 1.55 శాతం లాభపడి రూ. 665 వద్ద క్లోజయ్యింది.