బ్యాడ్ న్యూస్: 71 పరుగులకే 6 వికెట్లు ఫట్.. గుడ్ న్యూస్: పంత్ హాఫ్ సెంచరీ

బ్యాడ్ న్యూస్: 71 పరుగులకే 6 వికెట్లు ఫట్.. గుడ్ న్యూస్: పంత్ హాఫ్ సెంచరీ

ముంబై: న్యూజిలాండ్తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్లో టీమిండియా బ్యాటింగ్ విభాగం ఘోరంగా ఫెయిలైంది. 71 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి టీమిండియా పీకల్లోతు కష్టాల్లో ఉంది. మూడో రోజు ఫస్ట్ సెషన్లో టీమిండియా బ్యాటర్లు ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్కు క్యూ కట్టారు.

జైశ్వాల్(5) ఎల్బీడబ్ల్యూ, రోహిత్ శర్మ (11) క్యాచ్ ఔట్, ఎజాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌలింగ్లో గిల్(1)  బౌల్డ్, ఎజాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్లో విరాట్ కోహ్లీ(1) క్యాచ్ ఔట్, ఎజాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌలింగ్లోనే సర్ఫరాజ్ ఖాన్(1) ఔట్, రవీంద్ర జడేజా కూడా ఎజాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్లోనే 6 పరుగులకే పెవిలియన్ బాట పట్టడంతో టీమిండియా అభిమానులు తీవ్ర నిరాశ చెందారు.

రిషబ్ పంత్ (50) 48 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని ప్రస్తుతం క్రీజులో ఉండి ఒంటరి పోరాటం చేస్తున్నాడు. లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. విజయం సొంతం కావాలంటే మరో 55 పరుగులు చేయాల్సి ఉంది.

న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ : 235 ఆలౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.

న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెకండ్ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ : 174 ఆలౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.

ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ : 59.4 ఓవర్లలో 263 ఆలౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (గిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 90, పంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 60, ఎజాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 5/103).

ఇండియా సెకండ్ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ : లంచ్ బ్రేక్ సమయానికి 20 ఓవర్లలో 92/6