IND vs SA: సఫారీ కోటకు బీటలు.. 40 పరుగులకే 5 వికెట్లు

IND vs SA: సఫారీ కోటకు బీటలు.. 40 పరుగులకే 5 వికెట్లు

327 పరుగుల ఛేదనలో సఫారీ బ్యాటర్లు తడబడుతున్నారు. భారత్ బౌలర్లను ఎలా ఎదుర్కోవాలో తెలియక పెవిలియన్‪కు క్యూ కడుతున్నారు.  షమీ, జడేజా విజృంభించడంతో13.1 ఓవర్లు ముగిసేసరికి సౌతాఫ్రికా 5 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

జోరుమీదున్న రెండు అగ్రశ్రేణి జట్ల(భారత్‌ – సౌతాఫ్రికా) మ్యాచ్ కావడంతో అభిమానులకు మంచి మజా ఉంటుందనుకున్నాం. కానీ, సఫారీ బ్యాటర్ల ఆట చూస్తుంటే.. రెండ్రోజుల క్రితం ముగిసిన భారత్-శ్రీలంక మ్యాచ్ గుర్తొస్తోంది. ప్రొటీస్ బ్యాటర్లు పోటీపడుతూ పెవిలియన్ చేరిపోతున్నారు. నాలుగు సెంచరీలతో భీకరమైన ఫామ్‌లో ఉన్న క్వింటన్‌ డికాక్‌(5) పరుగులకే వెనుదిరగగా.. టెంబా బవుమా (11), మార్క్‌రమ్‌ (9), హెన్రిచ్‌ క్లాసెన్‌(1), వాండర్ డస్సెన్(13) స్వల్ప స్కోరుకే ఔట్ అయ్యారు. 13.1 ఓవర్లు ముగిసేసరికి సౌతాఫ్రికా 5 వికెట్ల నష్టానికి 40 పరుగులు చేసింది. ప్రస్తుతం మార్కో జెన్ సెన్(2), డేవిడ్ మిల్లర్(0) క్రీజులో ఉన్నారు.

ALSO  READ : NZ vs PAK: 400 కాదు.. 450 అయినా ఛేదిస్తాం..: బాబర్ ఆజామ్

ఇప్పటివరకూ భారత బౌలర్లలో షమీ, జడేజాలు రెండేసి వికెట్లు తీయగా.. సిరాజ్ ఒక వికెట్ పడగొట్టాడు.