IND vs SA: కింగ్స్‌మీడ్‌లో వర్షం.. టాస్‌ ఆలస్యం

IND vs SA: కింగ్స్‌మీడ్‌లో వర్షం.. టాస్‌ ఆలస్యం

డర్బన్‌ వేదికగా భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య  జరగాల్సిన తొలి టీ20కి వర్షం అంతరాయం కలిగిస్తోంది.నిన్నటి నుంచి ఇక్కడ ఏకధాటిగా వర్షం కురుస్తుండటంతో పిచ్‌ను కవర్లతో కప్పిఉంచారు. మ్యాచ్‌ ప్రారంభమయ్యే సమయానికి తగ్గుముఖం పడుతుందని భావించినా అది జరగలేదు. దీంతో టాస్‌ ఆలస్యమవుతోంది.