మళ్లీ పెరిగినయ్.. కొత్తగా దేశంలో కరోనా కేసులు ఎన్నంటే

మళ్లీ పెరిగినయ్.. కొత్తగా దేశంలో కరోనా కేసులు ఎన్నంటే

దేశంలో కాస్త తగ్గినట్లుగా కనిపించిన కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 9 వేల 629 కొత్త కేసులు నమోదయ్యాయి.  ఏప్రిల్ 25  మంగళవారం రోజుతో పోలిస్తే కేసులు 44 శాతం పెరిగాయి. తాజా కేసులతో కలిపి యాక్టివ్ కేసుల సంఖ్య 61 వేల13కు చేరుకుంది.   ఇక కరోనాకు మరో 29 బలయ్యారు.  

ఢిల్లీలో ఆరు, మహారాష్ట్ర,  రాజస్థాన్‌లలో ఒక్కొక్కటి, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో రెండు , ఒడిశా, గుజరాత్, ఛత్తీస్‌గఢ్‌లలో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు.  తాజా మరణాలతో మరణాల సంఖ్య 5 లక్షల 31 వేల 398కి పెరిగింది.  రికవరీ రేటు 98.68% ఉండగా, కేసు మరణాల రేటు 1.18%గా ఉందని  కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.  మరోవైపు  11 వేల 967  మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏప్రిల్ 25 మంగళవారం రోజున దేశంలో 6 వేల 66 0 కరోనా కేసులు నమోదయ్యాయి .

ఒమిక్రాన్ సబ్-వేరియంట్ XBB.1.16 ఎఫెక్ట్ తోనే.. కేసులు పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.  ఏప్రిల్ నెల చివరి నుంచి క్రమంగా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు. అప్పటి వరకు ఇదే రీతిన కరోనా కేసులు పెరుగుతాయని.. జనం ఆందోళన పడాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తున్నారు.

 ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలని.. నలుగురిలో ఉన్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కరోనా వచ్చినా మరణాలు సంఖ్య చాలా చాలా తక్కువగా ఉందని.. ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడే మరణాలు జరుగుతున్నాయని.. కేవలం కరోనాతో చనిపోతున్న వారి సంఖ్య ఒకటీ, రెండు మాత్రమే ఉంటున్నాయని చెబుతున్నారు అదికారులు.