భారత్ సాయాన్ని ఎప్పటికీ మరిచిపోలేం

భారత్ సాయాన్ని ఎప్పటికీ మరిచిపోలేం

శ్రీలంకకు 2 బిలియన్ రూపాయల విలువైన వస్తువులు పంపి, సహాయం చేసి.. మానవత్వాన్ని చాటుకున్న భారత్ కు శ్రీలంక మాజీ క్యాబినెట్ మంత్రి నమల్ రాజపక్సే కృతజ్ఞతలు తెలిపారు. భారత్ చేసిన ఈ సాయాన్ని తాము ఎప్పటికీ మరిచిపోలేమని అన్నారు."శ్రీలంకకు ఆపత్కాలంలో  అత్యవసరమైన వస్తువులను చేరవేసిన PM నరేంద్ర మోడీ, గౌరవ ముఖ్యమంత్రి MK స్టాలిన్ & భారతదేశ ప్రజలకు కృతజ్ఞతలు అని కొనియాడారు. భారతదేశం ఎప్పటికీ శ్రీలంకకు ఒక పెద్ద సోదరుడు & మంచి స్నేహితుడు అని వ్యాఖ్యానించారు. ధన్యవాదాలు' అని మరోసారి ఇండియాపై మమకారాన్ని నమల్ రాజపక్స ట్విట్టర్ లో  తెలిపారు. 
 

శ్రీలంకలో ఆయిల్ కొరత ఎక్కువగా ఉండడంతో క్రెడిట్ లైన్ ఫెసిలిటీ కింద భారత్ 40 వేల టన్నుల డీజిల్ పంపించింది. శ్రీలంకకు సాయం చేసేందుకు క్రెడిట్ లైన్ ను మరో 500 మిలియన్ డాలర్లకు పొడిగిస్తున్నట్లు పోయిన నెలలోనే మన దేశం ప్రకటించింది. ఆకలితో అల్లాడుతున్న శ్రీలంక ప్రజలను ఆదుకునేందుకు మన దేశం, జపాన్ ముందుకొచ్చాయి. కేంద్ర అనుమతితో తమిళనాడు ప్రభుత్వం అక్కడికి రూ.45 కోట్ల విలువైన సరుకులను పంపింది. 9 వేల టన్నుల బియ్యం, 200 టన్నుల పాల పొడి, 24 టన్నుల మందులను పంపించింది. 

మరిన్ని వార్తల కోసం...

డాక్టర్ ను సస్పెండ్ చేసిన మంత్రి హరీష్ రావు

వర్షానికి వణికిన ఢిల్లీ .. కూలిన ఇళ్లు, చెట్లు