కాబూల్‌ నుంచి భారత్‌కు చేరుకున్న ఎంబసీ స్టాఫ్, ఐటీబీపీ జవాన్లు

కాబూల్‌ నుంచి భారత్‌కు చేరుకున్న ఎంబసీ స్టాఫ్, ఐటీబీపీ జవాన్లు

న్యూఢిల్లీ: అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌ నుంచి భారత రాయబారి రుద్రేంద్ర టాండన్ సహా ఎంబసీ సిబ్బంది, ఐటీబీపీ జవాన్లు సేఫ్‌గా భారత్ చేరుకున్నారు. ఇవాళ (మంగళవారం) ఉదయం ఇండియన్ ఎయిర్‌‌ఫోర్స్ విమానం సీ17లో కాబూల్‌ నుంచి బయలుదేరి 11 గంటల సమయంలో గుజరాత్‌లోని జామ్‌నగర్ ఎయిర్‌‌ బేస్‌లో ల్యాండ్ అయ్యారు. ఎంబసీ స్టాఫ్, ఐటీబీసీ సిబ్బంది, నలుగురు మీడియా పర్సన్స్‌తో కలిసి మొత్తం 120 మందితో ఈ విమానం ఇండియా చేరుకుంది.

తాలిబన్లు అఫ్గాన్‌ను పూర్తిగా తమ హస్తగతం చేసుకున్న నేపథ్యంలో నిన్న కాబూల్ సహా అనేక ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అన్ని విమాన సర్వీసులు రద్దు చేయడంతో పాటు అమెరికా మిలటరీ ఆధీనంలో ఉన్న కాబూల్ ఎయిర్‌‌పోర్టును బంద్ చేసింది. అయితే అనేక దేశాల ప్రజలు ఇంకా అఫ్గాన్‌లో చిక్కుకుని ఉండడంతో వాళ్లను స్వదేశాలకు తరలించేందుకు రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టడం కోసం కాబూల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌‌పోర్టును ఓపెన్ చేసింది. దీంతో ఇవాళ ఎంబసీ సిబ్బంది, అధికారులు, ఐటీబీపీ జవాన్లను ఇండియన్ ఎయిర్‌‌ఫోర్స్ భారత్‌కు తీసుకొచ్చింది.