శ్రీలంక ప్రజలకు భారత్ మద్దతు కొనసాగుతుంది

శ్రీలంక ప్రజలకు భారత్ మద్దతు కొనసాగుతుంది

శ్రీలంకలో ముదురుతున్న రాజకీయ సంక్షోభంతో పరిస్థితులు ఉద్రిక్తతంగా మారుతున్నాయి. ప్రజాగ్రహం నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు గొటబయ రాజపక్స దేశం నుంచి మాల్దీవులకు పారిపోయిన విషయం తెలిసిందే. అయితే అందుకు భారత్ సహకరించిందనే వార్తలపై భారత హైకమిషన్  స్పందించింది. అవన్నీ నిరాధార, ఊహాజనిత వార్తలని హైకమిషన్ తోసిపుచ్చింది. మునుపటిలాగే ఆ దేశ ప్రజలకు భారత్ మద్దతు కొనసాగుతుందని ప్రకటించింది. కాగా రాజీనామా చేయకుండానే పారిపోయిన గొటబయకు వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. తాజాగా ప్రధాని విక్రమసింఘే శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించగా.. నిరసనకారులు ఆందోళనను తీవ్రతరం చేశారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన మిలిటరీ దళాలు.. వారిపైకి టియర్ గ్యాస్ ప్రయోగించడమే కాకుండా.. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు.