వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ లో రెండోస్థానానికి భారత్

వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ లో రెండోస్థానానికి భారత్

చెన్నైలోని చెపాక్ వేదిక‌గా జ‌రిగిన రెండో టెస్టులో టీంఇండియా 317 రన్స్ తేడాతో ఇంగ్లండ్ పై భారీ విజ‌యాన్ని సాధించింది. ఈ విక్టరీతో మొదటి టెస్టులో ఎదురైన ఓట‌మికి ప్ర‌తీకారం తీర్చుకోవ‌డంతో పాటు నాలుగు టెస్టుల సిరీస్‌ను 1-1 స‌మం చేసింది ఇండియా.

రెండో ఇన్నింగ్స్‌లో 482 ప‌రుగుల భారీ విజ‌య‌ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఇంగ్లండ్ 164 పరుగుల‌కే కుప్ప‌కూలింది. ఈ విజయంతో భారత్ ICC వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ లో రెండోస్థానానికి దూసుకెళ్లింది. చెన్నైలో ఇంగ్లండ్ పై గెలిచి 4 టెస్టుల సిరీస్ ను 1-1తో సమం చేసిన టీమిండియా వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ చేరే అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. ఇంగ్లండ్ జట్టు పాయింట్ల పట్టికలో నాలుగోస్థానానికి చేరింది. టెస్టు చాంపియన్ షిప్ జాబితాలో న్యూజిలాండ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఆ జట్టు ఇప్పటికే ఫైనల్ చేరుకుంది. మరో బెర్తు కోసం భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య గట్టిపోటీ నెలకొంది.

భారత్ జట్టు ఐసీసీ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ కు చేరాలంటే సిరీస్ లో మిగిలిన రెండు టెస్టుల్లోనూ విజయం సాధించాల్సి ఉంటుంది లేదా 2-1తో భారత్ సిరీస్ గెలవాల్సి ఉంది.