
న్యూఢిల్లీ,వెలుగు: కరోనా కేసుల్లో ఇండియా నాలుగో స్థానానికి చేరింది. బ్రిటన్ (2,91,409), స్పెయిన్ (2,89, 787)ను దాటేసింది. మొన్నటి దాకా ఆరో స్థానంలో ఉన్న దేశం, ఒకేసారి రెండు స్థానాలు ముందుకొచ్చింది. గురువారం 10,677 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో 2,97,832కు చేరాయి. రికార్డు స్థాయిలో ఒక్కరోజే 390 మంది చనిపోయా రు. మరణాల సంఖ్య 8,498కు పెరిగింది. లక్షా 46 వేల 485 మంది నుంచి కోలుకున్నారు. లక్షా 42 వేల 634 మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మహా రాష్ట్రంలో ఒక్క రోజులోనే 3,607 మందికి పాజిటివ్ వచ్చింది. కేసుల సంఖ్య 97,648కి చేరింది. 3,590 మంది చనిపోయారు. దేశంలో కేసులు 3 లక్షలకు, మహారాష్ట్రలో లక్షకు దగ్గ రయ్యాయి. ఢిల్లీలో ఒక్కరోజే 1,877 ఢిల్లీలో ఒక్కరోజే రికార్డ్ స్థాయిలో 1,877 కొత్త కేసులు నమోదయ్యాయి. 65 మంది చనిపోయారు. ఢిల్లీలో మొత్తం 34,687 కేసులు నమోదు కాగా, 1,085 మంది చనిపోయారు. 12,731 మంది కోలు కున్నారు. తమిళనాడులోనూ ఒకే రోజు 1,875 కొత్త కేసులు నమోదయ్యాయి. 38,716 మంది కరోనా బారిన పడ్డారు. 349 మంది చనిపోయారు. కొత్త కేసులు,మరణాల్లో టాప్5 ప్రపంచవ్యాప్తంగా రోజూ నమోదవుతున్న కొత్త కేసులు, మరణాల్లో ఇండియా టాప్ 5లో ఉంది. కొత్త కేసుల విషయంలో బ్రెజిల్ మొదటి స్థానంలో ఉండగా, అమెరి కా రెండు, ఇండియా మూడో స్థానంలో ఉన్నాయి. ఒక్కరోజు నమోదవుతున్న డెత్ ల విషయంలోనూ ఇండియా నాలుగో స్థానంలో ఉంది. ఈ జాబితాలో బ్రెజిల్, అమెరికా, మెక్సికో ముందున్నాయి. మొత్తం మరణాల్లో మన దేశం 11వ స్థానంలో ఉంది. మొన్నటి దాకా 12వ స్థానంలో ఉండగా ఇప్పుడు ఒక స్థానం ముందుకొ చ్చింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 75 లక్షలు దాటాయి. 75 లక్షల 36 వేల 412 మంది కరోనా బారిన పడ్డారు. 4 లక్షల 21 వేల 236 మంది చని పోయారు. 38 లక్షల 19 వేల 858 మంది కోలుకు న్నారు. 15 రోజులుగా లక్షకుపైనే కేసులు నమోదవుతున్నాయి. బుధవారం (జూన్10న) రికార్డ్ స్థాయిలో లక్షా 35 వేల 578 కొత్త కేసులు రికార్డ్ అయ్యాయి.