పాకిస్తాన్ పై జలయుద్ధం.. బాగ్లిహార్ డ్యామ్ దగ్గర నీరు నిలిపివేసిన భారత్

పాకిస్తాన్ పై జలయుద్ధం.. బాగ్లిహార్ డ్యామ్ దగ్గర నీరు నిలిపివేసిన భారత్

ఢిల్లీ: పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో భారత్ - పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెల కొన్నాయి. ఉగ్రవాద భూతాన్ని కూకటివేళ్లతో పె లించాలని దృఢ నిశ్చయంతో ఉన్న ఇండియా టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్న పొరుగుదేశంపై ముప్పేట దాడి చేస్తోంది. పాకన్ను అన్ని వైపుల నుంచి భారత్ దిగ్బంధిస్తోంది. ఇప్పటికే ఆ దేశ పౌరుల వీసాల రద్దు చేసి పాకిస్తానీయు లను వెనక్కి పంపించింది. దౌత్య సిబ్బందిని తగ్గించింది. అటారి సరిహద్దు మూసివేసింది. పాక్ కు చెందిన సోషల్ మీడియా అకౌంట్లపై నిషేధం విధించింది. వ్యాపార ఆంక్షలు విధిం చడంతో పాటు దౌత్యపరంగా ప్రపంచ దేశాలు మద్దతు కూడగట్టి ఆ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. 

Also Read : లోయలో పడ్డ ఆర్మీ వాహనం

తాజాగా జమ్మూకశ్మీర్ లో పర్యాట కరంగాన్ని దెబ్బతీసే కుట్ర చేసిన దాయాది దేశంపై ఇండియా జల యుద్ధం ప్రకటించింది. ఆ దేశంతో కుదుర్చుకున్న సింధు నది జలాల ఒప్పందాన్ని ఇప్పటికే రద్దు చేసుకున్న భారత్... తాజాగా రెండో దశ చర్యలు ప్రారంభించింది. పాక్ వ్యవసాయరంగానికి మూలాధారమైన నదీజలాల ప్రవాహాలను మన దేశం నుంచి పొరుగు దేశం వెళ్లకుండా కట్టడి చేసే చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా చినాబ్ నదిపై ఉన్న బాగ్లిహార్ డ్యామ్ వద్ద నీటి ప్రవాహాన్ని కట్టడి చేసే పనులను అధికార యంత్రాంగం ప్రారం భించింది. 

900 మెగావాట్ల జలవిద్యుత్తు ఉత్పత్తి నిమిత్తం ఈ డ్యామ్ను చినాబ్ నదిపై 2008లో నిర్మించారు. ఈ డ్యామ్ పొడవు దాదాపు 145 మీటర్లు. సింధు జలాల ఒప్పందం కింద పాకు అత్యధిక వాటా నీళ్లు లభించిన నదుల్లో చినాబ్ కూడా ఒకటి. ఈ నదీ జలాల ఆధారంగా దాయాది దేశంలోని పంజాబ్ పరిసర ప్రాం తాల్లో పంటలకు సాగునీరు అందుతుంది. మరోవైపు జీలమ్ నదీ జలాల విషయంలోనూ కేంద్రం చర్యలకు సిద్ధమవుతుంది. ఈ నదిపై ఉన్న కిషన్ గంగా డ్యామ్ నుంచి నీటి ప్రవాహాలు పాకిస్తాన్ వైపు వెళ్లకుండా చర్యలు తీసుకుంనేందుకు ఇండియా సిద్ధమవుతుంది. ఇప్పటికే మన దేశం సింధు నీటి ఒప్పందాన్ని నిలిపివేయంతో ఉక్కిరిబిక్కిరవుతున్న దాయాది దేశం రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూ నోరు పారేసుకుంటుంది.

పదోరోజూ కవ్వింపు చర్యలు

నియంత్రణ రేఖ వెంబడి పాక్ కవ్వింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కాల్పుల విమరణ ఒప్పందాన్ని ఉల్లం ఘిస్తూ వరుసగా పదోరోజూ సరిహద్దు చెకోపోస్టుల సమీపంలో పాక్ రేంజర్లు కాల్పులు జరిపారు. నిన్న అర్థరాత్రి సరిహ ద్దు రేఖ సమీపం కుప్వారా, బారాముల్లా, పూంచ్, రాజౌరి, మెంధర్, నౌషెరా, సుం దుర్భని, అక్నూర్ సెక్టార్లలో పాక్ సైన్యం కాల్పులకు తెగబడగా ఇండియన్ ఆర్మీ ధీటుగా బదులిచ్చింది.