దేశం బాగు కోసం.. కొత్త రాజ్యాంగం రావాలె

దేశం బాగు కోసం.. కొత్త రాజ్యాంగం రావాలె

మన దేశం బాగుపడడం కోసం, అమెరికాను మించిన ఆర్థిక శక్తిగా ఎదగడం కోసం రాజ్యాంగం మారాలని అన్నానని సీఎం కేసీఆర్ చెప్పారు. ఆదివారం సాయంత్రం ప్రగతి భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్యాంగం మార్చాలనడంలో తప్పేంటన్నారు. ‘‘దేశంలో దళితుల జనాభా 19 శాతానికి పెరిగింది. వాళ్ల రిజర్వేషన్ కూడా అంతే స్థాయిలో పెంచాలి. దేశంలో ఆడ పిల్లలకు రక్షణ లేదు. మగపిల్లలతో సమానమైన ఆస్తి హక్కు ఇవ్వాలె. కేంద్రం.. రాష్ట్రాల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోంది. రాష్ట్రాల హక్కులను కాపాడేలా పటిష్టమైన మార్పులు చేయాలి. ఇవన్నీ రాజ్యంగంలో పొందుపరచాలె. అందుకే రాజ్యాంగాన్ని మార్చాలంటున్నా. తప్పా? బీసీ కుల గణన చేయాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న రాజ్యాంగంలో ఆ వీలు లేదు. అంబేద్కర్ అంటే నాకు ఎంతో గౌరవం. రాజ్యాంగాన్ని మార్చుకోవాలని, ప్రగతిశీలంగా ఉండాలని ఆయనే చెప్పారు. అమలు చేసేవాడు మంచి వాడై ఉండాలని, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్లు తన పేరు వాడుకోవాద్దని ఆయన కోరుకున్నారు’’ అని కేసీఆర్ అన్నారు. 

మన దేశం అమెరికాను మించి పోవాలె

దేశంలో దళితులకు రక్షణ లేదని, ఈ  పరిస్థితి ఎందుకు ఇంకా ఉందని కేసీఆర్ ప్రశ్నించారు. ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకురావడం కోసం రాజ్యాంగం మార్చాలని అంటున్నామన్నారు. అది తప్పా అని కేసీఆర్ నిలదీశారు. దేశంలో అందరికీ సమాన రక్షణ, బాధ్యతలు, హక్కులు ఉండాలని, అందుకే రాజ్యాంగంలో మార్పులు జరగాలని అన్నారు. ‘77 శాతం సంపద పది శాతం మంది దగ్గర కాదు, 77 శాతం సంపద 95 శాతం మంది దగ్గర ఉండాలని అంటున్నా. అది తప్పా?’ అన్నారు.  అమెరికా కంటే మించి గొప్ప ఆర్థిక శక్తిగా ఎదిగే వనరులు, వసతులు, యువత మన దేశంలో ఉందని, ఆ శక్తిని సమ్మిళితం చేసి.. భారత్ నిడిపించేలా కొత్త రాజ్యాంగం రావాలని అంటున్నా తప్పా అని కేసీఆర్ అన్నారు. చైనాలా మనం కూడా అభివృద్ధి కావాలని కోరుతున్నానన్నారు. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని అన్నారు.

మరిన్ని వార్తల కోసం..

త్వరలో హైటెక్ సిటీని మించి ఉప్పల్ అభివృద్ధి

బీజేపీ అవినీతిపై ఢిల్లీలో పంచాయితీ పెడ్తా

‘సర్కారు వారి పాట’ ఫస్ట్ సింగిల్ రిలీజ్