రికవరీ బాటలో… ఎకానమీ!

రికవరీ బాటలో… ఎకానమీ!

వ్యవసాయం కాపాడుతోంది

జులై మాక్రో ఎకనామిక్రిపోర్ట్

న్యూఢిల్లీ: దేశ ఎకానమీ అధ్వాన్న  స్థితిని దాటినట్టు కనిపిస్తోందని, కరోనా నష్టాలను వ్యవసాయ రంగం తగ్గిస్తోందని ఫైనాన్స్‌‌‌‌ మినిస్ట్రీ ఓ రిపోర్ట్‌‌‌‌లో పేర్కొంది. ఈ ఏడాది మాన్‌ సూన్‌ బాగుండడంతో వ్యవసాయ రంగంలో గ్రోత్‌ కనిపిస్తోందని తెలిపింది. ‘దేశ ఎకానమీ ఏప్రిల్‌‌‌‌లో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంది. ప్రభుత్వం , ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ తీసుకున్న చర్యలతో ఆ స్థాయిల నుంచి రికవరీ అవుతోంది’ అని జులైకు సంబంధించి రిలీజ్‌ చేసిన మా క్రో ఎకనామిక్‌‌‌‌ రిపోర్ట్‌‌‌‌లో ఎకనామిక్‌‌‌‌ అఫైర్సు డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ పేర్కొంది.

ఆన్‌ లాకింగ్‌‌‌‌ ప్రక్రియ మొదలవ్వడంతో ముఖ్యమైన ఇండికేటర్లు జూన్‌లో రికవరి సిగ్నల్స్‌‌‌‌ను చూపిస్తున్నాయని తెలిపింది. అయినప్పటికీ పెరుగుతున్న కరోనా కేసులు, కొన్ని రాష్ట్రా లు లాక్‌‌‌‌డౌన్‌ ను కొనసాగిస్తుండడం వంటి రిస్కులు ఇంకా ఉన్నాయని చెప్పింది. వేగంగా పెరుగుతున్న కేసులను ప్రభుత్వం మానిటరింగ్‌‌‌‌ చేస్తోందని తెలిపింది. దీర్ఘకాల యావరేజ్‌ (ఎల్‌‌‌‌పీఏ)కంటే 102 శాతంగా సాధారణ వర్షపాతం ఉంటుందని అంచనా వేస్తున్నామని ఈ రిపోర్ట్‌‌‌‌లో పేర్కొంది. దేశ గ్రాస్‌ వాల్యూ యాడెడ్‌‌‌‌లో అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌కు 15 శాతం వాటా ఉందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎకానమీపై కరోనా ప్రభావాన్ని తగ్గించడానికి వ్యవసాయ రంగం సా యపడుతుందని అంచనావేసింది. వ్యవసాయ రంగానికి కరోనా లాక్‌‌‌‌డౌన్‌ నుంచి మినహాయిం పులివ్వడంతో రబీ పంటల కోత విజయవంతంగా పూర్తయ్యిందని, ఖరీఫ్‌‌‌‌ పంటల కోసం నాట్లు వేయడం మెరుగుపడిందని పేర్కొంది. రికార్డ్‌‌‌‌ స్థాయిలో గోదుమల సేకరణ జరిగిందని, దీంతో సుమారు రూ. 75 వేల కోట్లు రైతుల చేతులకు అందుతాయని చెప్పింది. రూరల్‌‌‌‌ ఏరియాలలో వినియోగం పుంజుకుంటుం దని అంచనా వేసింది.

రికవరీ వైపు ఇండెక్స్‌‌‌‌లు

అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌ సెక్టా ర్లో నియంత్రణలను ప్రభుత్వం తగ్గిస్తోందని ఈ రిపోర్ట్‌‌‌‌ పేర్కొంది. దీంతో దేశ వృద్ధిలో రైతులు కీలకంగా మారడానికి వీలుంటుందని చెప్పింది. ఏప్రిల్‌‌‌‌తో పోల్చుకుంటే మే నె లలో కీలకమైన ఎనిమిది సెక్టార్లలో ఇండస్ట్రీయల్‌‌‌‌ అవుట్‌‌‌‌పుట్‌‌‌‌ పెరిగిందని ఈ రిపోర్ట్‌‌‌‌లో ప్రభుత్వం తెలిపింది. జూన్‌ లో రికవరీ సంకేతాలు పెరిగాయని, మాన్యుఫాక్చరింగ్‌‌‌‌ పీఎంఐ ఇండెక్స్‌‌‌‌ మే నె లలో 30.8 పాయింట్లుగా ఉండగా, జూన్‌ లో 47.2 పాయింట్లకు పెరిగిందని పేర్కొంది. సర్వీస్‌ పీఎంఐ కూడా మే లో 12.6 పాయింట్లుగా ఉండగా, జూన్‌ లో 33.7 పాయింట్లకు పెరిగిందని తెలిపింది. ఈ ఏడాది మే నుంచి పరిశీలిస్తే  59 శాతం కంపెనీలు తమ ప్రొడక్షన్‌ స్టేబుల్‌‌‌‌గా ఉందని రిపోర్ట్‌‌‌‌ చే శాయని ఈ రిపోర్ట్‌‌‌‌ చెప్పింది. 4 శాతం కంపెనీలు గ్రోత్‌ ను చూడగా, 37 శాతం కంపెనీలు మాత్రం డీగ్రోత్‌ ను నమోదు చేశాయని పేర్కొంది. అన్‌ లాకింగ్‌‌‌‌ ప్రక్రియ కొనసాగడంతో ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌, కన్‌స్ట్రక్షన్‌ యాక్టివిటీ కూడా మెరుగుపడుతోందని తెలిపింది.