
ఆసియా గేమ్స్‌లో ఇండియా బాక్సర్ల పంచ్ కూడా అదురుతోంది. వరల్డ్ చాంపియన్ లవ్లీనా బొర్గోహైన్ పారిస్ ఒలింపిక్ బెర్త్ సాధిస్తే, ప్రీతి పవార్, నరేందర్ బ్రాంజ్ మెడల్స్‌తో మెరిశారు. విమెన్స్ 75 కేజీ సెమీస్ బౌట్‌లో టోక్యో ఒలింపిక్ బ్రాంజ్ మెడలిస్ట్ లవ్లీనా 5-0తో బైసన్ మనికోన్ (థాయ్‌లాండ్)పై గెలిచి ఫైనల్లోకి అడుగుపెట్టింది.
తద్వారా ఒలింపిక్ కోటాను సాధించింది. 54 కేజీల బౌట్‌లో ప్రీతి 0-5తో ఫ్లైవెయిట్ చాంపియన్ చాంగ్ యువాన్ (చైనా) చేతిలో ఓడి కాంస్యంతో సరిపెట్టుకుంది. మెన్స్ +92 కేజీ సెమీస్‌లో నరేందర్ బెర్వాల్ 0-5తో వరల్డ్ చాంపియన్‌షిప్ మెడలిస్ట్ కమ్షిబెక్ కుంకబయేవ్ (కజకిస్తాన్) చేతిలో ఓడాడు. దాంతో పాటు తృటిలో ఒలింపిక్ బెర్త్‌ను మిస్ చేసుకున్నాడు.